Friday, July 17, 2026
26.4 C
Hyderabad

ప్రజలారా పారా హుషార్‌!|EDITORIAL

దేశ రాజధాని ఢిల్లీ నడి బొడ్డున ఎర్రకోట సమీపంలో బాంబు పేలుళ్ళు ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి. దేశం క్షేమమేనా? మనం భద్రమేనా? దేశాధ్యక్షులు, ప్రధాని, మంత్రులు, దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యులు నివాసముండే చోటే బాంబులు పేలి, తల్ల‘ఢిల్లి’న వైనం విస్మయం కలిగించకమానదు. అత్యంత రక్షణాత్మక చర్యలు తీసుకునే చోటే బాంబులు పేలితే మిగతా నగరాలు, గ్రామాల పరిస్థితి ఏంటి? భారత దేశం భద్రంగానే ఉందా? భూగోళంపై అత్యంత జనాభా కలిగిన దేశంలో జనం పరిస్థితేంటి? అనుకోకుండా జరిగే సంఘటనలు వేరు, అదే పనిగా జరుగుతుండటం వేరు. పాలకులేం చేస్తున్నారు? నిఘా, రక్షణ, పోలీసు వ్యవస్థలేం చేస్తున్నాయి? మొన్న పెహల్గాం, నిన్న ఢిల్లీలో బాంబ్‌ పేల్చారు. మరి రేపు? మన చుట్టూ ఉన్న దేశ ప్రజలను రక్షించడం కూడా మన కర్తవ్యం కావాలి. ప్రతి ఒక్కరు చైతన్యంతో మెలగాలి. మనమంతా ప్రభుత్వానికి, అధికారులకు అండగా నిలవాలి. ఏకోన్ముఖంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

దేశ రాజధాని ఢిల్లీ నడి బొడ్డున ఎర్రకోట సమీపంలో బాంబు పేలుళ్ళు ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి. దేశం క్షేమమేనా? మనం భద్రమేనా? దేశాధ్యక్షులు, ప్రధాని, మంత్రులు, దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యులు నివాసముండే చోటే బాంబులు పేలి, తల్ల‘ఢిల్లి’న వైనం విస్మయం కలిగించకమానదు. అత్యంత రక్షణాత్మక చర్యలు తీసుకునే చోటే బాంబులు పేలితే మిగతా నగరాలు, గ్రామాల పరిస్థితి ఏంటి? భారత దేశం భద్రంగానే ఉందా? భూగోళంపై అత్యంత జనాభా కలిగిన దేశంలో జనం పరిస్థితేంటి? అనుకోకుండా జరిగే సంఘటనలు వేరు, అదే పనిగా జరుగుతుండటం వేరు. పాలకులేం చేస్తున్నారు? నిఘా, రక్షణ, పోలీసు వ్యవస్థలేం చేస్తున్నాయి? ఇవి సహజంగా వచ్చే ప్రశ్నలు.

ఢిల్లీలో ఉగ్రదాడులు ఈరోజే మొదలైనవేమీ కావు. 1990 నుంచే పెచ్చరిల్లాయి. 1996 మే 21న లజపత్ నగర్ మార్కెట్‌లో బాంబ్ పేలుడులో 13 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. 2001 డిసెంబర్ 13 న సాయుధ లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేశారు. భద్రతా దళాలు వీరిని సమర్ధంగా ఎదుర్కొని, ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. ఈ దాడికి కీలక సూత్ర, పాత్రధారి అఫ్జల్ మహ్మద్‌కు, భారత సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. ఈ దాడితో భారత పాక్ సంబంధాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమై, 2001-02 నాటి సైనిక మోహరింపుకు దారితీసింది.
2005 అక్టోబర్ 29న సరోజనీనగర్, పహర గంజ్, గోవింద్ పురి ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. 60-70మంది చనిపోయారు. 200 మంది గాయపడ్డారు. 2008 సెప్టెంబర్ 13న కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, గ్రేటర్ కైలాష్ మార్కెట్లలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. 25-30 మంది వరకు మృతులు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. తాజాగా, 2025 నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో కారు బాంబ్ పేలుడు జరగడంతో కనీసం 12 మంది మరణించి, 20కి పైగా గాయపడ్డారు. ఉగ్రవాద దాడిగా పోలీసు విచారణ చేపట్టారు.

అయితే, తాజా దాడులతో ఇస్లామిక్‌ టెర్రరిస్ట్‌ ముష్కరులు మరోమారు భారత్‌కు సవాల్‌ విసిరారు. మనలో ఒకరుగా, మనలోనే, మనతోనే ఉంటూ, ముష్కరులు మనలను మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దాడులు కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. కశ్మీర్ అసెంబ్లీపై దాడి, హైదరాబాద్, ముంబై సహా దేశంలోని అనేక చోట్ల నుంచి పుల్వామా, పెహల్గాం దాకా, ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిఘా వర్గాలు ఉగ్రవాదులను గుర్తించి, వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న గంటల్లోనే ఎర్రకోట వద్ద మారణహోమం జరిగింది. ఈ ఘటన మరోసారి జాతి యావత్తునూ ఉలిక్కిపడేలా చేసింది.

పెహల్గాం దాడి తరవాత పాక్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టినప్పటి నుంచి ఇలాంటిది ఏదో ఉగ్రదాడి తప్పదన్న సంకేతాలు, హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. దేశంలో కొందరు ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం, కొందరు ఉగ్రవాదులతో కలిసి ఉగ్రదాడులకు పాల్పడటం చేస్తున్నారు. హైదరాబాద్‌లో పట్టుబడ్డ ముష్కరుడు సామూహికంగా ప్రజలను అంతం చేసే ప్రణాళికలో ఉన్నట్లు తేలింది. మంచినీళ్లు, ప్రసాదాల్లో విషం కలిపి చంపే అతిపెద్ద కుట్రను పోలీసులు ఛేదించారు. ఢిల్లీ ఘటన స్థలాన్ని సందర్శించి, ఆ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇప్పటికే ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్ర మూకులను ఏ కలుగులో దాక్కున్నా వదిలేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు.

ఇక దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. ఉగ్రవాదులతో హైదరాబాద్‌ కే ఏదో విధంగా సంబంధాలుంటున్నాయి. ఉగ్రవాదులు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనేక దర్యాప్తుల్లో తేలింది. తాజా, ఢిల్లీ బాంబు పేలుళ్లలోనూ హైదరాబాద్‌ లింకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ హైదరాబాద్ లో బాంబు దాడులు జరగడం తెలిసిందే.

ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఢిల్లీ సహా హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆయా నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. అనుమానిత వ్యక్తులు, వస్తువులు, వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర సీపీ సజ్జనార్ సూచించారు. గుంపులు గుంపులుగా తిరగవద్దని వీలైనంత వరకు ప్రజలు ఇంటికే పరిమితం కావడం మంచిదని హెచ్చరించారు.
మొన్న పెహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరుతో హత్యాకాండకు తెగించారు. ఇప్పడు ఢిల్లీలో బాంబ్‌ పేల్చారు. మరి రేపు? ఉగ్ర మూకలు జన సమ్మర్థ ప్రాంతాలనే టార్గెట్ చేస్తున్నారు. జన సమూహాలు అధికంగా ఉండే పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ప్రార్థనా మందిరాలు వంటి చోట్ల అప్రమత్తంగా ఉండాలి. రైల్వే స్టేషన్లు, బస్‌ టెర్మినల్స్ తో పాటు, ఢిల్లీ మెట్రో స్టేషన్లలో భద్రతా సంస్థలు నిఘా వేశాయి. పుకార్లను నమ్మకూడదని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు భరోసా ఇస్తున్నారు. భద్రతను కల్పించడం, రక్షించడం కేవలం పోలీస్‌ లేదా ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, మనల్ని మనం రక్షించుకుంటూ, మన చుట్టూ ఉన్న దేశ ప్రజలను రక్షించడం కూడా మన కర్తవ్యం కావాలి. ప్రతి ఒక్కరు చైతన్యంతో మెలగాల్సి ఉంది. ఇదే సమయంలో మనమంతా ప్రభుత్వానికి, అధికారులకు అండగా నిలవాలి. ఏకోన్ముఖంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News