టీమ్ ఇండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ఆయన భార్య ధనశ్రీ విడాకులు తీసుకోనున్నారనే వార్తల మధ్య, చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో మద్యం మత్తులో ఉన్న చాహల్‌ను ఓ వ్యక్తి పబ్ నుంచి బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం కారులో కూర్చున్న చాహల్, ఫొటోగ్రాఫర్ల ముందు తన ముఖాన్ని చేతితో దాచే ప్రయత్నం చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. “ప్రేమతో పెళ్లి చేసుకున్న చాహల్ జంట చివరకు ఇలా విడిపోతుందా….?” అంటూ నెటిజన్లు చర్చ చేస్తున్నారు. ఈ ఘటనపై చాహల్ నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు.

