ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు, కొత్తగ ఈత నేర్సుకునేటోల్లు లొట్టలు కట్టుకుని, ట్యూబులేసుకుని ఇగ గా బాయిలకు పొద్దు పొడిసిన కాన్నుంచి, పొద్దుకుంగే దాకా ఉండేటోల్లు. ఇగ గా బాయిల్ల నీల్లే తర్వాత ఎద్దు యెవుసానికి వాడేటోల్లు. ఇగిప్పుడు గా బాయిలే లేవు. బాయిల్ల నీల్లు లేక పాడుబడిన బొందలైనయి. వట్టిపోయి వట్టియే బోకెలైనయి. మరైతే గా పొల్లగాల్ల ఈతల మోజెట్ల తీరాలె? గందుకే స్విమ్మింగ్ పూల్స్ వచ్చినయి. రిసార్టులొచ్చినయి. గవాట్లకుపోలేనోల్లు ఏం శేయాలె? గ సొంటోల్ల కోసం ఓ తెలివైన ఆలోశన శేసిండో అన్న. గదేందో సూద్దామా?
గా ట్రాక్టర్ ఉంటది కదా? దానికో ట్రాలీ ఉంటది గద? గదాంట్లే పరదా పరిసిండు. గండ్ల నీల్లు నింపిండు. ఇగ గండ్లనే ఈతలు కొట్టమని, గవాల్ల పోరగాండ్లకు శెప్పిండు. ఇగ గా పొల్లగాండ్లు పొల్లు పొల్లుగ గండ్ల ఆడుతాండ్లు. గీ ముచ్చట కరీంనగర్ జిల్లా కూనవానిపల్లెల జరిగింది. గిది శేసిన గాయిన సమాజానికి సందేశమిత్తాండు. కనీసం మండలానికో ఈత కొలను సర్కార్ కట్టాల్నెని చెప్తాండు. మరి గీ ముచ్చట గా సర్కార్ తీరుస్తదా? లేదా? సూడాలె.!
ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

