Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

నమ్మిన మోసమా!? నమ్మక ద్రోహమా!?|MAOIST|RED FLAG

లొంగిపోవడానికి పిల్చి…
ప్రశ్నించడానికి పట్టుకెళ్ళి…
నమ్మించి…నట్టడవిలో కాల్చి…
హిడ్మా దళం దగా పడిందా?
లొంగిన వాళ్ళను పోలీసులే మట్టుబెట్టారా?
హిడ్మా ఎన్ కౌంటర్ పై అనేక అనుమానాలు
పట్టుబడ్డాకే మట్టు పెట్టారంటున్న ప్రజాసంఘాలు
ఆ అవసరం మాకు లేదంటున్న పోలీసులు
అగ్రనేతలే లక్ష్యంగా పోలీసుల ప్రణాళిక
మావోయిస్టుల అంతానికే ఆపరేషన్ పన్నాగం
హిడ్మా లేఖ రాసిన ఆ జర్నలిస్టు ఎవరు?
ఆరా తీస్తున్న పోలీసులు, నిఘా వర్గాలు!

హైదరాబాద్, నవంబర్ 19 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కీలకం. ఆ పార్టీ గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్ జీఏ) ప్లాటూన్ 1 ప్రధాన కమాండర్, ప్రభుత్వం, పోలీసులకు మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్ కౌంటర్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఎన్ కౌంటర్ బూటకమని, పట్టుకెల్లి మట్టుబెట్టారని సీపీఐ, ప్రజా, పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆవసరం మాకు లేనే లేదని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ దశలో ఏపీలో వేర్వేరు చోట్ల పట్టుబడ్ట నక్సలైట్లు హిడ్మా ప్లాటూన్ సభ్యులేనని ఆ రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏడీజీ లద్దా ప్రకటించారు. వారిని బుధవారమే కోర్టులో హాజరు పరిచారు. ఈ ప్రకటనతోపాటు, నక్సల్స్ కదలికలపై అవగాహన ఉన్న వారి ఆలోచనలు, మారేడ్ మిల్లి అడవుల్లో జరిగిన హిడ్మా ఎన్ కౌంటర్ వంటి ఘటనలు, తాను లొంగిపోవడానికి హిడ్మా దళం నిర్ణయించుకుని, ఓ జర్నలిస్టుకు లేఖ రాశారన్న పుకార్లు వంటి ఈ వరుస పరిణామాలు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి.

మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ స్థాయిలో కీలకంగా ఉన్న హిడ్మా పోలీసులకు కొరకరానిక కొయ్యగా మారాడు. పోలీసులే చెబుతున్నట్లు వారికి భారీ నష్టం వాటిల్లిన అన్ని ఘటనలకు బాధ్యుడు హిడ్మానే. పైగా మావోయిస్టు పీఎల్ జీఏ ఒకటవ ప్లాటూన్ కు కమాండర్. మావోయిస్టు దాడుల చోదక శక్తిగా పని చేసిన, అంతటి వ్యక్తి దళమే బెజవాడలో పట్టుబడిందని కూడా ఏపీ పోలీసులే ప్రకటించారు. ఇదిలా వుంటే, బెజవాడలో హిడ్మా దళంగా భావిస్తున్న 50 మంది నక్సలైట్లు పట్టుబడగా, హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్ లు మారేడ్ మిల్లిలో ఎన్ కౌంటర్ అయ్యారు. ఈ రెండు మంగళవారం తెల్లవారుజామునే జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలు కాకతాలీయంగా జరిగినవా? కావాలనే చేసినవా? అనే అనుమానాలను ప్రజా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అరణ్యాల్లో సేఫ్టీ లేకే జనారణ్యంలోకి వచ్చిన నక్సల్స్ లో హిడ్మా, ఆయన భార్య, మరికొందరితో తిరిగి అడవుల్లోకి వెళ్ళారా? అలా చేసి ఉంటారా? పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన హిడ్మా అంత ఈజీగా దొరికాడా?

అయితే, హిడ్మా తన దళంతోపాటు లొంగిపోవడానికి సిద్ధపడి, ఓ జర్నలిస్టుకు లేఖ రాశాడన్నదాన్ని బట్టి చూస్తే, లొంగిపోవడానికే హిడ్మా సహా ఆయన దళం కానూరు న్యూ ఆటో నగర్ లో దిగిందా? హిడ్మా లొంగుబాటుకు దళాన్ని ఎవరు రప్పించారు? వారే వచ్చారా? వారిలో నుంచి హిడ్మా, ఆయన భార్య, మరికొందరు మాత్రమే ఎందుకు వేరుగా వెళ్ళారు? వారిని లొంగుబాటులో ప్రక్రియలో భాగంగానే జనారణ్యంలోకి రప్పించి, షెల్టర్ పై దాడి చేసి, హిడ్మా అతడి భార్యను మరికొందరిని పట్టుకెళ్ళి కాల్చి చంపారా? అనుమానాలు రాకుండానే మిగతా అతడి దళాన్ని అరెస్టు చేశారా? ఒకవేళ ఇవన్నీ తప్పైతే అసలు హిడ్మా సమాచారాన్ని ఇచ్చిందెవరు? లేక ఆయనంతట ఆయనే పోలీసులకు దొరికిపోయాడా? అన్న అనుమానాలు ప్రజా, పౌరహక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు హిడ్మా లేఖ రాసింది నిజమేనా? ఆయన రాసిందెవరికి? ఆ జర్నలిస్టు ఎవరు? అన్న కోణంలోనూ పోలీసులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయని తెలిసింది. ఈమొత్తం ఎపిసోడ్ లో ఎవరైనా కోవర్టులుగా పని చేశారా? అన్నది కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

ఇదిలావుంటే, ఆధునిక టెక్నాలజీ, డ్రోన్లు, లొంగుబాట్లు, లొంగినవాళ్ళిస్తున్న సమాచారం, ప్రజల్లో మావోయిస్టులకు తగ్గిన ఆదరణ, అక్కున చేర్చుకునే వారే లేకపోవడం, గతంలోలా ప్రభుత్వాలను ప్రశ్నించేవారే కరువవడం, పెరిగిన నిర్బంధాలు, తరిగిన మావోయిస్టులు, లెఫ్ట్ తీవ్రవాదమే లేకుండా చేయాలన్న కేంద్ర ప్రభుత్వం గట్టి సంకల్పం. ‘ఆపరేషన్ కగార్’ ప్రణాళిక, పోలీసులు, దళాల లక్ష్యం, మావోల ఉద్యమాల్లో సమన్వయ లోపం, అంతర్గత కలహాలు, భిన్నాభిప్రాయాలు, బేధాభిప్రాయాలు, విభేదాలు వెరసి మావోయిస్టుల యుద్ధం ముగియడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
మొత్తానికి దేశంలో1967లో ప్రారంభమైన దాదాపు ఆరు దశాబ్దాల ఉత్థాన, పతనాల సాయుధ విప్లవ సుదీర్ఘ ప్రయాణం ముగింపుకు చేరుతోంది.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News