కేసీఆర్ గతంలో 12 గంటల్లో సర్వే చేసి ఇప్పుడు తమ కులగణన లెక్కలు తప్పంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. మా ప్రభుత్వం ఏ గ్రామంలో, ఏ వార్డులో ఏం తప్పు ఉందో చూపించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. అలాగే బండి సంజయ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ…. ‘కేసీఆర్ సర్వేలో 51 శాతం బీసీలుంటే మా సర్వేలో 56 శాతం ఉన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చారని బండి సంజయ్ అంటున్నారు. దూదేకుల సహా 28 జాతులకు ఎప్పటినుంచో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి’ అనే విషయం తెలియదా అని విమర్శించారు.

