గురువంటే విద్యా బుద్ధులు నేర్పేవాడే కాదు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవాడు. భావి భారతానికి బాటలు వేసే వాడు. గిట్లనే సదువుకుని ఎదిగిన, గీ ముచ్చట ఎరిగిన గా సదువుకున్న పొల్లగాండ్లు గా సారును అపూర్వంగా గౌరవించిండ్రు. ఓ కరెంటు కారును బహుమానంగా ఇచ్చి సత్కరించిండ్రు.

గది కరీంనగరు సర్కారు జిల్లా విద్యా శిచ్చణ సంస్థ. గదాన్నే డైట్ అంటరు. గాడ సదువు సెప్పాల్సిన సార్లకు సదువు సెప్తరు. గాడ గట్ల ఇంగ్లీసు సదువు సెప్పిన సారు గుర్రం మహేశ్వర్ రెడ్డి. గాయినె మొన్న పదవీ విరమణ శేసిండ్రు. గాయిన దగ్గర 2004 నుండి 2014 వరకు సదువుకున్నోల్లంతా కలిసి, ఓ కరెంటు కారును గదేనుల్లా ఈవీ కారును బహుమతిగ ఇచ్చిండ్రు. ఇగ సారును ఎత్తుకొని గా కార్ల కూసోబెట్టిండ్రు. ఇగ తన దగ్గర సదువుకున్న గావాల్లంత కలిసి సూపిన అభిమానానికి గా సారు తబ్బిబ్బైపోయిండు. సారంటే గట్లుండాలె. పిల్లలంటే గిట్లుండాలె మరి! ఏమంటరు?

