శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-వర్షఋతువు
భాద్రపద మాసం కృష్ణపక్షం
తిధి త్రయోదశి రాత్రి 09.40 వరకు
ఉపరి చతుర్దశి
నక్షత్రం పుబ్బ రాత్రి 09.50 వరకు
ఉపరి ఉత్తర
యోగం శుక్ల రాత్రి 02.25 వరకు
ఉపరి బ్రహ్మ
కరణం గరజి ఉదయం 10.23 వరకు
ఉపరి వణజి
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
దుర్ముహూర్తం ఉదయం 09.45 నుండి
10.32 వరకు తిరిగి పగలు 02.27 నుండి
03.14 వరకు
వర్జ్యం ఉదయం 06.21 నుండి 07.54
వరకు
సూర్యోదయం ఉదయం 06.08
సూర్యాస్తమయం సాయంత్రం 06.01
మేష రాశి:
వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా లాభం పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం ఉత్సాహాన్ని పెంచుతుంది.
వృషభ రాశి:
నిలిచిపోయిన పనులను కొత్త ఉత్సాహంతో ప్రారంభించగలుగుతారు. పెద్దల నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
మిథున రాశి:
అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యను పరిష్కరించగలుగుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మాటల్లో తొందరపాటు లేకుండా వ్యవహరించండి.
కర్కాటక రాశి:
కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది.
సింహ రాశి:
ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ తెలివితేటలను చక్కగా ఉపయోగించగలుగుతారు. కుటుంబంలో చిన్నపాటి ఆందోళన ఉన్నా త్వరగా పరిష్కారమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కన్య రాశి:
ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. ఆర్థికంగా మంచి అవకాశాలు లభించవచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. గతంలో చేసిన తప్పుల నుంచి మంచి పాఠాలు నేర్చుకుంటారు.
తుల రాశి:
కొత్త పనిని ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. లాభదాయకమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి:
మీకు ప్రత్యేకంగా అనుకూలమైన రోజు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరవచ్చు. ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన వార్త వినే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి:
బాధ్యతలను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత పాటించాలి. ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. తొందరపడి ఉద్యోగ మార్పు నిర్ణయం తీసుకోకండి.
మకర రాశి:
ఉద్యోగ, వృత్తి విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. అయితే పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులు బడ్జెట్‌ను మించకుండా చూసుకోవాలి. మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా ముఖ్యం.
కుంభ రాశి:
ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. పనిలో ఒత్తిడి ఉన్నా పట్టుదలతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాల్లో ప్రశాంతంగా మాట్లాడటం మంచిది.
మీన రాశి:
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి ముందుగానే ప్రణాళిక చేసుకోండి. ఉద్యోగంలో అనవసర చర్చలకు దూరంగా ఉండండి. కోపంలో నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి.


