అడుగు అడుగు అడుగు
అన్యాయాన్ని ఎదిరించే ప్రశ్నలు అడుగు
కడుగు కడుగు కడుగు
మలిన రాజకీయాలను జర్నలిజం జలమైకడుగు
వేసినావు ముందడుగు
అది కావాలి మడమ తిప్పని అడుగు
ప్రజాస్వామ్య పరిరక్షణకై పట్టినావు గొడుగు
నీవు రాసే అక్షరాలే కావాలోయ్ కదనానికి పిడుగు
కలమే బలమై
కల కల మై
అణగారిన వర్గాలకు ఆలంబనమై
సకల జనాలకు సర్వమై సర్గమై
మంచి మార్గమై
అడుగు అడుగు అడుగు
నీతిని నిలబెట్టే ప్రశ్నలు అడుగు
మలిన రాజకీయాలను జర్నలిజం జలమైకడుగు

-అనంతం పాలకురికి

