యెనకటికి మనుసులు యెన్నో శక్తియుక్తులు పదర్శించేటోల్లు. స్రుస్టికి పతి స్రుస్టి శేసేటోల్లు. మట్టి బొమ్మలకు, రాయి రప్పలకు పానం పోసేటోల్లు. గట్ల ఒచ్చినయే గీ రోబోలు. యినుప ముక్కలను మనిసి లెక్క ఒక్కటి శేసి, గవాటికి కంప్యూటర్ల తోటి గా పోనం పోసిండ్రు. మనిసి మెదడు నుండి పుట్టుకొచ్చిన గీ రోబోలు మనిసి కంటే ఇంకా ఎక్కువే పని శేత్తానయి. ఇగియ్యి గీ ఉరకుట్ల కూడా మనిసి ని దాటేసినయి.

గా దుబాయ్ ల రన్ చాలెంజ్ పేరుతోటి షేక్ జాయెద్ రోడ్డుల యేలాది మంది పరుగులు పెట్టిండ్రు. గండ్ల గా ఉరుకుతున్నోల్లతోటి గా రోబోలు కూడా ఉరికినయి. ఇగ ఉరుకంగ ఉరుకంగ.. గా రోబోలే పస్టు వచ్చినయిట.ఇగ గిది సూసినోల్లు.. నోరెల్లబెట్టిండ్రట. గిదేంది? మనిసి తయారు సేసిన గా రోబోలే మనుసుల కంటే ఎక్కవైనయి కదా? అనుకుంటాండ్రు.

