ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను ఏసీబీ దాదాపు 7 గంటల పాటు విచారించింది. తనకు తెలిసిన మేరకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించానని, భవిష్యత్తులో కూడా ఏసీబీ పిలిచినప్పుడు హాజరవుతానని చెప్పారు. రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే తిరిగి తిరిగి అడిగారని, కొత్తగా ఏమీ ప్రశ్నించలేదని వెల్లడించారు. ముఖ్యంగా నాలుగు ప్రశ్నలను 40 సార్లు అడిగినట్లు పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత మరోసారి విచారణ జరిగే అవకాశముందని సమాచారం.

