Sunday, October 18, 2026
24.8 C
Hyderabad

బతుకమ్మ|BATHUKAMMA|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను పూల పండుగగా పిలుస్తారు. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16న రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇదే రోజున బోనాలు పండుగను కూడా రాష్ట్ర పండుగగా గుర్తించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది. దసరా పండుగ సందర్భంలో తొమ్మిది రోజులపాటు బతుకమ్మను తెలంగాణ మహిళలు ఘనంగా జరుపుకుంటారు. భాద్రపద మాస అమావాస్యనాడు ఎంగిలి పూల బతుకమ్మగా మొదలై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. గౌరీ మాతకు ప్రతీకగా తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ (పెద్ద బతుకమ్మ) జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ శరదృతువు ప్రారంభాన్ని సూచిస్తుంది.

ఆవు పేడతో కల్లాపి చల్లి ముగ్గు వేసి (బియ్యపు పిండి తో) అలంకరిస్తారు. తంగేడు పూలు,గునుగుపూలు, ముత్యాల పూలు, కట్ల పూలు,బంతిపూలు, చేమంతి పూలు, మందార పూలు, తామర పూలు, రుద్రాక్ష పూలు, గుమ్మడి పూలు, శంకు పూలు, పట్టుకుచ్చు పూలు మొదలైన పూలను వరుసగా గోపురం ఆకారంలో పేర్చి శిఖరం పైన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. తొమ్మిది రోజులపాటు వివాహిత మరియు అవివాహిత స్త్రీలు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా తిరుగుతూ లయబద్దంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. చివరగా నీటిలో నిమజ్జనం చేస్తారు.

తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకోవడం వెనుక కేవలం గౌరమ్మను ఆరాధించడమే కాక కొన్ని శాస్త్రీయ బద్ధమైన కారణాలు కూడా ఉన్నాయి. జూన్ మాసంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణ ప్రాంతంలో ప్రవేశించాక పడే వర్షాలకు కలుషితం అవడం వల్ల ప్రజలకు రోగాలు, పంటలకు తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది. తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో వాడే ప్రతి పువ్వులో ఒక ఔషధ గుణం ఉంటుంది. ఈ పూలను ప్రతిరోజు చెరువులలో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి. దీని ద్వారా కలుషితమైన నీరు శుద్ధి అవుతుంది. ఆ నీటిని వాడకం చేసిన ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని నమ్మకం.

ఈ పండుగను తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. గ్రామాల్లో అయితే ఊరి చెరువు వద్ద, పట్టణాల్లో అయితే గుడి వద్ద బతుకమ్మ ఆడుతారు.వరంగల్ జిల్లాలో మొదటి రోజు వేయి స్తంభాల గుడిలో బతుకమ్మను చేస్తే చివరి రోజు పద్మాక్షి గుట్టపై ఆడతారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బతుకమ్మ పండుగను 11 రోజులు జరుపుకుంటారు. వేములవాడలో ఏడు రోజులు జరుపుకుంటారు. అక్కన్నపేట, హుస్నాబాద్, తోటపల్లి, గాంధీనగర్ గ్రామాల్లో మహిళలతోపాటు పురుషులు కూడా బతుకమ్మ ఆడుతారు. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేటలో దీపావళి నుండి మూడు రోజులపాటు పురుషులు ఈ బతుకమ్మ పండుగను ‘సిత్రాల బతుకమ్మ’ పేరుతో జరుపుకుంటారు.

బతుకమ్మ పండుగను 9 రోజులు ఈ విధంగా జరుపుకుంటారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఈ రోజున నువ్వులు నూకలు నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ (అటుకులు, బెల్లం ఉడకబెట్టిన పప్పు నైవేద్యంగా పెడతారు). మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ (ముద్దపప్పు, పాలు, బెల్లం నైవేద్యం). నాలుగవ రోజు నాన బయ్యం బతుకమ్మ (తడి బియ్యం, పాలు, బెల్లం) అయిదవరోజు అట్ల బతుకమ్మ (అట్లు). ఆరవ రోజు అలిగిన బతుకమ్మ (ఈ రోజున బతుకమ్మ ఆడరు). ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ (బియ్యప్పిండి ని వేప పండ్ల ఆకారంలో చలివిడిగా చేస్తారు). ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ (వెన్న, నువ్వులు, బెల్లం). 9వ రోజు సద్దుల బతుకమ్మ తో(పులిహోర, దద్దోజనం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం మొదలగునవి నైవేద్యంగా సమర్పిస్తారు) ఈ పండుగ పూర్తి అవుతుంది.

దసరా/విజయదశమి

దసరా హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, పదవ రోజున విజయదశమి కలిపి దసరా అంటారు. ఇది ప్రధానంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండుగ. ఈ నవరాత్రులనే దేవీ నవరాత్రులని పిలుస్తారు. అమ్మవారి ఆలయాల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో పూజిస్తారు. తెలుగువారు దసరాను పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. పదవరోజున విజయదశమి(దసరా).

పౌరాణిక గాథల ప్రకారం జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయం పొందిన సందర్భంగా పదవ రోజున ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు విజయదశమిగా ప్రసిద్ధిగాంచింది.

ఇతిహాసాల ప్రకారం రాముడు రావణుడిపై విజయం సాధించిన సందర్భాన్ని విజయదశమిగా జరుపుకుంటారని ఒక నమ్మకం మరియు పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై ఉంచిన తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా కూడా దీనిని భావిస్తారు.కాబట్టి విజయదశమి రోజున రావణ వధ, ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది.

దేవీ పూజకు ఈశాన్య భారతదేశంలో ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. దసరా ఉత్సవాలను దేశమంతటా వివిధ రూపాల్లో నిర్వహిస్తారు. కలకత్తా, ఖానాపూర్, విజయవాడ, తెలంగాణ మొదలగు ప్రాంతాల్లో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.

తెలంగాణలో దసరా

దసరా సమయంలో కరీంనగర్ వాసులు ‘అకాడా’ నిర్వహిస్తారు. అకాడా అంటే క్షత్రియులు ఆయుధ విన్యాసాలను ప్రదర్శించడం. ఇక్కడ బొగ్గుగనిలో పనిచేసే కార్మికులు ఈ పండుగను గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా చేస్తుంటారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న సంగారెడ్డిలో శక్తి పటాల ఊరేగింపు, దాదాపు 100 సంవత్సరాల క్రితం బొందిలికి చెందిన సైనికుడు మచిలీపట్నం మరియు ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేశాడు అప్పటినుండి దసరా సమయంలో శక్తి పటాన్ని పట్టుకొని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకురావడం ప్రారంభమైంది. ఊరేగింపు సమయంలో పటాన్ని వీపునకు కట్టుకొని ముఖానికి అమ్మవారి భయంకర ముఖాకృతిని తగిలించుకొని వీధుల్లో నాట్యమాడుతూ తిరుగుతారు. వరంగల్ జిల్లాలో భద్రకాళీ మాతకు కూడా తెప్పోత్సవం నిర్వహిస్తారు

విజయవాడలో దసరా

విజయవాడలోని ప్రధాన ఆలయం అయిన ఇంద్రకీలాద్రి కనకదుర్గాదేవి ఆలయంలో దసరాను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడుసార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. చివరి రోజైన విజయదశమినాడు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలు బేతాళ నృత్యం చేస్తారు.

కలకత్తాలో విజయదశమి

బెంగాలీలు దసరాను దుర్గా పూజగా జరుపుకుంటారు. 9 రోజులు బెంగాల్ రాష్ట్రం అంతటా ఘనంగా పూజలు చేసి చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. కథక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధి వీధిన ఊరేగిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి, లక్ష్మీదేవిగా భావించి పూజ నిర్వహిస్తారు.

Latest News

భివండిల ‘మహా’ బతుకమ్మ!?|ADUGU TRENDS

ఈ పపంచకంలనే పక్రుతిని ఆరాధించి, పువ్వులనే దేవుల్లుగ కొలిసే అరుదైన పండుగ బతుకమ్మ. గీ పండుగ తెలంగాణలనే కాదు. ఇగిప్పుడు గీ తెలంగాణోల్లు ఏడుంటే గాడ ఘనంగా జరుగుతాంది. ఒకప్పటి లెక్క గాకుండ,...

పూల పండుగకు ప్రపంచ పట్టాభిషేకం!|EDITORIAL|BATHUKAMMA

పూల సోయగాలు.. ఉయ్యాల పాటలు.. కోలాటాల సందడి.. వెరసి బతుకమ్మ సంబురం! తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ పూల పండుగ నేడు ఖండాంతరాలు దాటి, ప్రపంచ వేదికపై మన సంస్కృతి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 18 నుండి అక్టోబర్  24 వరకు రాశి ఫలాలు మేష రాశి కొత్త పనులు ప్రారంభించాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభించవచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి....

ఈ దంపతులు సింపతీ కోల్పోతున్నారా!?|KONDA SUREKHA|KONDA MURALI|FAMILY

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం..పైగా సెపరేట్ ఈసీపై ఏఐసీసీ ఆందోళనలకు కూడా హాజరుకాని వైనం పట్టభద్రుల ఎమ్మెల్సీ సమాయత్త సమావేశానికి గైర్హాజర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రుల సందర్శనలోనూ నో వేర్ పైగా విడిగా పార్టీ...

బతుకమ్మ వాయినం!?|ADUGU TRENDS

‘ఇత్తినమ్మ వాయినం అంటే, తీస్కుంటినమ్మ వాయినం.’ అని అంటరు. గిదేందంటే, పండుగలు, పబ్బాలకు, శుభ కార్యాలకు, రతాలకు ముత్తైదువులకు అందించే తాంబూలం, పిండివంటలు, పండ్లు-పూలు, పసుపు-కుంకుమలను కలిపి ఇచ్చే కానుకలను వాయినం అంటరు....

పటిష్ట వ్యవస్థ తప్పనిసరి!|EDITORIAL

ఓటరు జాబితాలో ఒక్క పేరు మాయమైనా.. ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బే! దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనలు, ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆరోపణలు ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. జాబితాల ప్రక్షాళన అవసరమే.....

అక్టోబర్ 17, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ చండికాదేవి అలంకరణ తిధి సప్తమి రాత్రి తెల్ల 05.10 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 08.16 వరకు ఉపరి పుర్వాషాఢ యోగం అతిగండ రాత్రి 10.31 వరకు ఉపరి సుకర్మ కరణం...

ఆడ ఏడో రోజే|SADDULA BATHUKAMMA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో...

పొద్దుగాల పెండ్లి.. సీకటి పడంగనే పెటాకులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.....

రియాద్ సంక్షోభం!|EDITORIAL

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! హౌతీల భీకర క్షిపణి దాడులతో సౌదీ రాజభవనాలు వణుకుతుండగా, క్రౌన్ ప్రిన్స్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ స్నేహహస్తాన్ని తిరస్కరించిన రియాద్ నిర్ణయం గల్ఫ్ రాజకీయాల్లో...

అక్టోబర్ 16, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ సరస్వతిదేవి అలంకరణ తిధి షష్ఠి రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం శోభ రాత్రి 09.56 వరకు ఉపరి అతిగండ కరణం కౌలవ పగలు...

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News