Monday, September 21, 2026
27.3 C
Hyderabad

అరె.. మనిసికి జంతువుకు తేడా లేదా!?|ADUGU TRENDS

మనిసి జంతువు ఒక్కటేనా? అంటే మనం కాదంటే కాదంటం. ఎందుకంటే మనిసి, జంతువు వేర్వేరు. అవి తినేయి మనం తినం, వాటి లెక్క మనం ఉండం. గవి గా జంగల్ల ఉంటయి. మనం గీ జనంల, ఊర్లల్ల ఉంటం. యెహె తియ్.. గవాటికి మనకు పోలికేంది? పొంతనేంది? అంటం. సచ్చమే గనీ, గీ మనిసి గూడ గా జంతువులెక్కనే తింటాండు, ఉంటాండు. సత్యపమాణంగా… కావాలంటే ఇగ సూడుండ్లి.
గీ పొల్లగాని పేరు బుడాన్. కర్ణాటకల ఉండె బెళగావి పక్కన ఉండె ఉదరగోళ ఊరు. 34 ఏండ్లుంటయి. గీయిన గత పదేండ్లుగ, గా పక్కన ఉన్న జంగల్లనే ఉంటాండట. గాడనె తింటడు. ఇగ గా జంగల్లనే పంటడు. గింత బయం లేదట. సరే గనీ, మరేం తింటడు.? అంటే, ఆకులు, అలములే తింటడట. పొద్దుగాల రొండున్నర, మూడు గంటలకే లేస్తడట. గంట సేపు ఓగా జేస్తడట. గదైనంక గా పక్కన పారే గా వాగు దగ్గర గాయింత పండ్లు తోముకుని, ఆ సుట్టుపక్కల ఆకులు టిపిని లెక్క తింటడట. ఇగ పగటాల గూడ గా ఆకులే తింటడు. పొద్దుమీకక ముందే మల్లా గా ఆకులు తిని, గా వాగుల నీళ్ళు తాగుతడట. గంతేగాదు. గీ బుడాన్ గా ఆకులను సిమాంట సేత ముట్టుకోడు. తెంపుకోడు. గా జంతువుల్లెక్కనే నోటితోనే సెట్టు ఆకులు తింటడు. గట్లనే గా వాగు మీదికి ఒంగి నోటిని గా పారే నీటికి పెట్టి నీల్లు తాగుతడు. గిట్ల గాయిన గీ పదేండ్లల్ల 80 రకాల ఆకులు తిన్నడట. రోజూ 50 రకాల యోగాసనాలేస్తడట. మొదట్ల గా ఆకులు సేదు సేదు, పసరు పసరు అనిపించినయట. తినగ తినగ యేప తియ్యనైనట్లు. గవి గా బుడాన్ నోటికి మంచిగనిపించినయట. ఇగ గీ బుడాన్ ముందర పరమాన్నం పెట్టినా ముట్టడు. పదేండ్ల కింద అన్నీ తినేటోడట. ఒకపాలి కోతులు ఆకులు తింటాంటె సూసిండట. ఇగ గా కోతులు, జంతువులు బతకంగ లేనిది ఆకులు తింటే నేనెందుకు బత్క? సూద్దామని అని ఆకులు తినుడు మొదలు పెట్టిండట. ఇగ గప్పటి నుంచి గవే తింటాండట. ఇగ గా బుడాన్ కి యే రోగం నొప్పి లేదట. ఒక్కపాలి దగ్గుపడిశం పట్టిందట. ఒక్కపాలి కాలిరిగిందంట. గంతే గప్పుడు తప్ప మల్ల దవాఖాన మొకమే సూల్లేదట.
పోట్టకు జంగలుంది. ఆకులలములున్నయి గనీ, బట్టకెట్లని, ఇగ ఊర్లకు బోయి, అన్ని రకాల పనులు జేస్తడట. ఇగ గీ సంగతిని గా డాక్టర్లను అడిగితే, ఆశీర పోయిండ్లంట. గా బుడాన్ కు పరీచ్చలు జేస్తే అంతా ఏక్ దమ్ గా ఉందట. గీ బుడాన్ కు మరిన్ని పరీచ్చలు చేస్తే ఎన్నో యింతలు తెలుస్తయని అంటున్నరు డాక్టర్లు. మనిసి జంతువులెక్క గా జంగల్ల బతుకుడు మంచిగుంది గదా? తిని తాగే కర్సు లేదు. పెయికి, పానానికి డోకా లేదు. ఇగ గిదీన్ని మనం గూడ మొదలు పెడితే ఎట్లుంటది? జెర సోచాయించుండ్లి. జివ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటే గిదేనుల్లా!?

Latest News

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News