Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

ఈ అతి గతి ఎటు!?|KONDA SUREKHA|KONDA MURALI

MINISTER| మంత్రికివ్వాల్సిన మర్యాదలు ఆమె HUSBAND| భర్తకా?
EAST|‘తూర్పు’ పోలీసులపై CP| సీపీ సీరియస్!
ACP| ఏసీపీ, CI| 4గురు ఇన్స్పెక్టర్లు, SI| ఎస్సైలకు మెమోలు!
‘కొండా’కు పైలెట్, ఎస్కార్ట్ గా వెళ్లినందుకు చర్యలు?
కొత్తగా వచ్చిన సీపీ, కొద్ది రోజుల ముందే ఓ సీఐ సస్పెన్షన్
ఇదంతా సీపీ లేవెలేనా? సీఎం లేవెల్ లో జరుగుతోందా?
మంత్రి కొండా సు‘రేఖ’దాట వద్దని హెచ్చరికలా?
అతిగా ప్రవర్తించే అందరికీ వార్నింగా?
పోలీసులపై ప్రోటోకాల్ క్రమ‘శిక్ష’ణలా?
సంచలనం కలిగిస్తోన్న కొండా ఎస్కార్ట్ యవ్వారం!

పోలీసులు ప్రోటోకాల్ ని మరిచారు. అతిగా ప్రవర్తించారు. మంత్రికివ్వాల్సిన మర్యాదను ఆమె భర్తకిచ్చారు. ముందూ వెనుకా చూసుకోవాల్సిన పోలీసులు ‘ముందు’, ‘వెనుక’ పరుగులు పెట్టారు. అందరినీ అదలిస్తూ అతిగా ప్రవర్తించారు. మంత్రికి మించిన గౌరవాన్ని అందించారు. ప్రస్తుతం ఏ పదవీ లేని ఆ మాజీకి తాజా నేతకివ్వాల్సిన మర్యాదలన్నీ చేసేశారు. పైలెట్ గా, ఎస్కార్ట్ గా ఆ రోజంతా తరించారు. అదే తమ మహద్భాగ్యంగా మైమరిచారు. డ్యూటీని బ్యూటీగా చేయండి అంటే, వెరైటీగా చేసి, ఏకంగా పోలీసు బాస్ కే బుక్కయ్యారు. అది కాస్తా వైరల్ కావడంతో, సీపీ నుంచి తాకీదులు అందుకున్నారు. వారికి మెమోలు జారీ చేశారు. చర్యలకు ఉపక్రమించారు. అలా ఒక్కరూ ఇద్దరూ కాదు. ఏకంగా ఓ ఎసీపీ, నలుగురు సీఐలు, పలువురు ఎస్ఐలు, వారి గన్ మెన్లు, ఇతర పోలీసులూ ఉన్నారు. మొత్తంగా తూర్పు నియోజకవర్గం ‘పోలీసు’ను ఆ నేత పాదాక్రాంతం చేసేశారు. గత కొంత కాలంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి, ఆమె భర్త కొండాలకు అండగా కొమ్ముకాస్తున్న పోలీసుల చర్యలపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ఇది సీపీ లేవెల్ లోనే జరిగిందా? లేక ఉన్నత స్థాయిలోనే ఉపక్రమించారా? సీపీ మారడం, ఓ సీఐని ఇప్పటికే సస్పెండ్ చేయడం, తాజాగా మెమోలు జారీ చేయడం, మెదక్ ఇన్ చార్జీ పదవి ఊడటం వంటి వరస ఘటనలు మంత్రి కొండా సు‘రేఖ’ దాటవద్దని హెచ్చరికలేనా? దీని ద్వారా అతిగా ప్రవర్తిస్తే అంతేసంగతులని మిగతా మంత్రుఅందరికీ వార్నింగులా?

పోలీసులు నిజంగా అతిగా ప్రవర్తించారు. ఇప్పుడు మెమోలు మాత్రమే అందుకున్నారు. రేపు దాని పర్యవసనంగా తగిన ప్రతిఫలాన్ని అనుభవించడానికి రెడీ అవుతున్నారు. అలా ఒక్కరూ ఇద్దరూ కాదు. ఒక ఏసీపీ, నలుగురు సీఐలు, పలువురు ఎస్ ఐలు, ఇతర పోలీసులు. రాష్ట్రానికి రెండో రాజధానిగా ఉన్న వరంగల్ నడిబొడ్డున ఇది జరిగింది. ఒక మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె భర్త కొండా మురళీ మాజీ ఎమ్మెల్సీ. ఈ నెల 13న కొండా మురళి తూర్పు నియోజకవర్గంలో పలు ప్రైవేట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు పైలెట్, ఎస్కార్ట్ గా ఏసీపీ నందిరామ్ నాయక్ సహా, మిల్స్ కాలనీ, ఇంతెజార్ గంజ్, మట్టెవాడ సీఐలు, ట్రాఫిక్ సిఐ, వారి పరిధిలోని ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు పలువురు వెళ్ళారు. ఆయనకు ఆరోజంతా మంత్రికి మించిన మర్యాదలు చేశారు. జనాల్ని అదిలిస్తూ హంగామా స్రుష్టించారు. తమ యూనిఫాంను విడిచి, చేయాల్సిన విధులను మరచి, తమ స్టేషన్లను వదిలి, తమను తాము మైమరచి అలా ఆ రోజంతా మంత్రి భర్తకు చేసిన ఉద్యోగమనే ఊడిగం చేశారు. దీంతో ఇది ఓ పత్రికలో పతాక శీర్షిక అయింది. సోషల్ మీడియాలో వైరల్అయింది. హాట్ టాపిక్ గా మారి అంతా చర్చనీయాంశమైంది.

ఈ ఘటన కాస్తా 14వ తేదీన వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ద్రుష్టికి వెళ్ళింది. ఆయన ఆరా తీశారు. దీనిపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారణ చేపట్టి సీపీకి నివేదిక అందజేశారు. ఆ ఎసీపీ, 4గురు సీఐలు, ఎస్ఐలకు మెమోలు జారీ చేశారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రకారం కొండా మురళి ఆ విధమైన సేవలు, ప్రోటోకాల్ కి అర్హులు కాదన్నారు. ఈ పోలీసుల అతిని కామన్ మ్యాన్ మొత్తం పోలీసు వ్యవస్థను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పడ్డారని, మీపై యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, ఒకవేళ వివరణ ఇవ్వకపోతే దాన్ని వివరణ ఇచ్చినట్లుగానే భావించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆ మెమోలో హెచ్చరించారు.

ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అందునా ఆ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళే ఈ ప్రోటోకాల్ ఇష్యూలో ప్రధానంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా మంత్రి కొండా సురేఖ కే చెక్ పెట్టే ప్రయత్నమేనా? తూర్పు నియోజకవర్గంలో వారి హవా, హడావుడి, దుర్వినియోగాన్ని కట్టడి చేయడంలో భాగంగానే ఇదంతా జరుగుతందా? లేక కేవలం ఇది సీపీ లేవెల్ లోనే జరిగిన ఘటనా? అన్న చర్చ ఊపందకుంది. కొద్ది రోజుల క్రితమే సీపీ రావడం, తూర్పులోనే ఒక సీఐ ఒక కేసులో సస్పెండ్ అవడం, ఇప్పుడు అతిగా ప్రవర్తించిన ఎసీపీ, నలుగురు సిఐలు, ఎస్ఐలపై చర్యలకు ఉపక్రమించడం మామూలుగా తీసుకునే అంశంగా కనిపించడం లేదు. రాష్ట్ర పోలీసు చరిత్రలో, వ్యవస్థలో ఈ ఘటన అత్యంత అరుదైనది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఈ ఘటనతో తూర్పులో మంత్రి కొండా దంపతులకు చెక్ పెట్టడంతోపాటు, అతిగా ప్రవర్తిస్తున్న మిగతా మంత్రులకు, ప్రజాప్రతినిధులకు హెచ్చరికలుగానే చూడాలని భావిస్తున్నారు.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News