Sunday, April 26, 2026
38.2 C
Hyderabad

ఇగో గీ మిషిన్లు సిటికెల కట్టింగులు సేత్తయి!?|ADUGU TRENDS


ఇగో, మనిసి సూపందాన్ని మార్సేది గా బట్టలు, గీ జుట్టే గదా! గందుకే తీరొక్క తీర్గ స్టైల్లు రాబట్టె. గయన్నీ సేయడానికి కొత్తకొత్త మిషిన్లు రాబట్టె. ఇగ గీ కట్టింగు మిషిన్లని సూడుండ్లి. సూడ్డాన్కి ఎల్మెట్ లెక్కున్నయి. నెత్తి మీద పెట్టంగనే సూత్తాంటే సెకండ్లనే కట్టింగు సేత్తానయి. గట్ల పెట్టి గిట్ల తీస్తే సాలు. తీరొక్క తీరుగ కట్టింగులు చేస్తయి. యిగ కట్టింగుల కోసం పడిగాపులు గాసుడు, లైన్లుండుడు. అపాయింటు మెంట్లు దీసుకునుడు, మంగలాయిన కోసం ఎదురుసూసుడు. మన తల్కాయను గాయన సేతుల బెట్టుడసొంటియేయి ఉండయి. గా ఎల్మెట్ ను యగ మన నెత్తిల బెట్టుకుంటిమా, అయిపాయె. సటుక్కున కట్టింగయిపోతది. ఇగ ఇప్పటికే రకరాల మిషీన్లు వచ్చనయి. ఎవలింటికాడ గ వాళ్ళే చేసుకోబట్టె. గిట్లాంటి మిషిన్లు ఒచ్చినంక ఇగ ఇంకేముంది? ఒక మిషీన్ను తెచ్చి పెట్టుకుంటే. సిటికెలల్ల కట్టింగు అయిపోతది. గిదంత బాగనే ఉంది గనీ, గా మంగలోల్ల పనేంగాను? అంతా గా మిషిన్లే జేస్తే, మనుసులకు మనుసులతోని పనేముంటదుల్ల? ఇసిత్రం గాకపోతే!

Latest News

పదే పదే అదే మాట!|BRS|KCR|TELANGANA

గెలిస్తే కేసీఆర్ క్రెడిట్|CREDIT ఓడితే ప్రజలదే పొరపాటు|PEOPLE గులాబీ బాస్ వింత శోధన|PINK BOSS కేసీఆర్ వితండ వాదన వెయ్యేళ్ళైనా బీఆర్ఎస్ కు బుద్ధి రాదా? ఇక కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మారదా? ‘అప్పుడు ఓట్లేసి తప్పు చేశారు... ఇప్పడు ప్రజలు...

గోడకు నీల్లు పట్టే ఇకమతు!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడితే, గా గోడలకు నీల్లు పట్టుడు అంత అల్కన కాదు. గోడలెక్కి పైపుతోటి నీల్లు కొట్టాలె. లేకపోతే గా కింది నుండే పైపుతోటి గోడలకు పట్టాలె. ఇగ గా నీల్లతోటి...

కవిత కొత్త పార్టీ భవిష్యత్తేంటి?|EDITORIAL

కవిత రాజకీయ ప్రయాణం ఒక అవకాశమూ, ఒక పరీక్ష కూడా. ప్రజా సమస్యలను నిజాయితీగా అర్థం చేసుకుని, వాటికి పరిష్కారాలు చూపగలిగితేనే ఈ పార్టీ నిలబడుతుంది. లేని పక్షంలో ఇది కూడా ఇతర...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 26 నుండి మే 02 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో చురుకుదనం కనిపిస్తుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మెరుగైన...

పేదోడి ఏసీ ఎట్లుందో సూడుండ్రి!?|ADUGU TRENDS

పేదోల్ల ప్రిజ్జు కూజలు, మట్టికుండల్ని సూసినం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.. కొన్నింటికి మనం కొనలేనప్పుడు, గసొంటి వాటినే కాస తక్కువల తయారు చేసుకుంటం. రకరకాల ఉపాయాలు శేత్తం. ఇగ గీ...

అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం!|EDITORIAL

ప్రజా సంక్షేమం, ఆర్థిక నియంత్రణ, పాలనా బాధ్యత..ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగినవి. వీటి మధ్య సమతౌల్యం అవసరం. లేకపోతే పరిపాలన, ప్రజాప్రగతి పడకేసి, దేశమే అల్లకల్లలమయ్యే ఆర్థిక ఇబ్బందుల ఆందోళన...

25-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి రాత్రి 09.55 వరకు తదుపరి దశమి నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.25 వరకు తదుపరి మఖ యోగం గండ రాత్రి 02.51 వరకు తదుపరి వృద్ధి కరణం బాలవ ఉదయం...

ఏయేయి ఎప్పుడు కొనాల్నో తెలుసా!?|ADUGU TRENDS

మనకు అవసరం ఉన్నప్పుడే యే వస్తువునైనా కొంటం. ఎప్పుడు పడితే గప్పుడు గా వస్తువలను కొంటే ఎక్కువ ధర పడ్తయి. ఇగ తక్కువ ధరకే గవాట్ని కొనాల్నంటే గవాటి సీజన్లను బట్టి గాకుండ,...

ప్రయాణ ప్రగతి రథ చక్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం!|EDITORIAL

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి...

24-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 11.34 వరకు ఉపరి నవమి నక్షత్రం పుష్యమి రాత్రి 12.18 వరకు ఉపరి ఆశ్లేష యోగం ధృతి ఉదయం 07.51 వరకు ఉపరి శూల కరణం భద్ర మధ్యాహ్నం...

ఖరీదైన కారుతోటే గా రోడ్డును బాగుశేసిండు!?|ADUGU TRENDS

మనసుంటే మార్గమున్నట్లే గద! మరి గా మార్గమే బాగా లేకపోతే? ఒకాయినె గా బాగా లేని రోడ్డును కోట్ల యిలువ శేసే ఖరీదైన కారుతోటి ఎట్ల బాగు శేసిండో సూడుండ్రి? బెంగళూరులో ఒకాయినె రోజూ...

ఒకటి ఒకటి ఒకటి! రెండు రెండు రెండు!!|EDITORIAL

దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పది, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News