ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం శేసోండో తెలుసా? ఎరైటీగా ఉంటదని? ఏకంగా కోళ్ళనే పంచి పెట్టిండు.

గీయినె పేరు రాకేష్ దత్త. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల సదువుతాండు. ఖమ్మంల పుట్టిన రోజు జరుపుకుండు. ఇగ గీ టైంల ఖమ్మంలోని రెండో డివిజన్ పాండురంగాపురంల ప్రజలకు, మున్సిపాలిటీ కార్మికులకు కోళ్లను పంచిండు. గిదేందివయా? అంటే అందరిలెక్క శేత్తే ఏముంటది? యెరైటీగా ఉంటుందని ఓ దోస్తుగాడు శెప్పిండు. నేను కోళ్ళను పంచిన అన్నడు. ఇగ అందరిలెక్క శేత్తే కిక్కేముంటది? కనీ, గాయినె పుట్టిన రోజు గీడ శేసుకుంటే బాగుండని అనుకుంటాండ్రట నీసుముచ్చు జనం.

