కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో Union Budget 2025 ను ప్రవేశపెట్టారు. ప్రతిసారీ బడ్జెట్ అంటే సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్ వర్గాల వరకు అందరిలోనూ భారీ ఆశలే ఉంటాయి. ఈసారి కూడా ఆర్థిక శాఖ నుంచి ఏమొస్తుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాధారణ పౌరుల కోసం ఏముంది?
ఇంకమ్ ట్యాక్స్ స్లాబ్ పెరిగితే పన్ను భారం తగ్గుతుందని ఆశిస్తూ మధ్య తరగతి వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అలాగే, రోజువారీ ఉపయోగంలో ఉండే ఉత్పత్తులు, సేవలపై పన్నులను తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
సబ్సీడీలు & ప్రోత్సాహకాలు
వివిధ రంగాల్లో ప్రభుత్వ సబ్సీడీలు పెంచి మద్దతు ఇవ్వాలని రైతులు, చిన్నతరహా వ్యాపారులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా, విద్య, ఆరోగ్యం, ఇంధన రంగాల్లో ప్రభుత్వ సహాయం పెరిగేనా? అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.

