రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు STATE ELECTION COMMISSION|రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 6వ తేదీన స్థానాల వారీగా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రచురించాలి. అదే రోజునుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నారు. ఈ కాలంలో వచ్చిన వినతులను పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు 8వ తేదీన రాజకీయ పార్టీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 9న అందిన అభ్యంతరాలను పరిష్కరించి, 10న తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలను ముద్రించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ చర్యలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది.


