Wednesday, September 16, 2026
29.4 C
Hyderabad

నరకంగా భూతల స్వర్గం!?|USA|TRUMP|H1B

ఇక AMERICA|అమెరికా కలలు కల్లలేనా?
హెచ్-1బీ వీసాల రుసుం భారీగా పెంపు
LAKH|లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ నిర్ణయం
వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు
హెచ్-1బీ వీసాల్లో 75శాతం ఇండియన్లే!
60వేల మంది INDIANS|భారతీయులపై ఈ ప్రభావం
ట్రెంపరీ చర్యలపై సర్వత్రా నిరసన
పిచ్చోడి చేతిలో రాయిలా అమెరికా?
అథ:పాతాళానికి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ?
చక్కబెట్టుకోవడానికే అమెరికా అక్కసు
ఒకప్పుడు డాలర్ కంటే మన రూపీ ఎక్కువ!?
మాకు నైపుణ్యమే ముఖ్యం : ట్రంప్
ఆధారపడటమే పెద్ద శత్రువు : మోదీ|NARENDRA MODI

భూతల స్వర్గం నరకంగా మారింది. కొత్త ఆవిష్కరణలు, సరికొత్త ఉద్యోగాలు, తిరుగులేని ఆదాయాలకు పెట్టింది పేరుగా ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక దేశం, అందలం ఎక్కిందని భావించిన ఆశావహులను అథ:పాతాళానికి నెట్టింది. ఒక రకంగా ట్రంపు చేతిలో అమెరికా, పిచ్చోడి చేతిలో రాయిలా మారింది.

వాషింగ్టన్ / న్యూ ఢిల్లీ / హైదరాబాద్, సెప్టెంబర్ 20 (అడుగు ప్రత్యేక ప్రతినిధులు):
అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ఇది పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సాధారణంగా 2వేల నుంచి 5వేల డాలర్లుండే, హెచ్-1బీ వీసాపై దరఖాస్తుపై వార్షిక రుసుమును అసాధారణంగా లక్ష డాలర్లకు పెంచారు. వెంటనే అంటే 24 గంటల్లోనే అంటే ఈ రోజు నుంచే అమలు అయ్యే విధంగా హుకుం జారీ చేశారు. సంబంధించిత జీఓపై సంతకం చేశారు. ఇక మీద అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు, విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.

అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణ కోసం 1970లో హెచ్-1బీ వీసాను తెచ్చారు. యూఎస్ లోని ఐటీ కంపెనీలు ఈ వీసాలను జారీ చేస్తాయి. హెచ్-1బీ వీసాల్లో భారత్ 71% వాటా కలిగి ఉండగా, చైనాకు 11.7% వాటా ఉంది. తాజాగా విధించిన ఫీజుతో దాదాపు 60వేల మంది భారతీయులపై ఈ ప్రభావం పడింది.

ఆదాయంలో 80 శాతం వీసా రుసుముకే
ప్రస్తుత అమెరికా నిబంధనల వల్ల సగటు భారతీయ ఇంజనీర్, తన సంపాదనలో ఏడాదికి 80 శాతం ఫీజుకే చెల్లించాల్సి వస్తుంది. అత్యధికంగా సంపాదించేవారు తప్ప మద్యస్థంగా, అంతకంటే తక్కువగా సంపాదించే వాళ్లకి అమెరికా ఆశాభంగమే. క్షణభంగురమే కానుంది. అప్పటికీ అమెరికా వెళ్ళాలనుకుంటే ప్రస్తుత ట్రంప్ నిర్ణయం పెను భారంగా మిగలనుంది. చాలా సందర్భాలలో ఈ ఫీజులను ఆయా కంపెనీలే భరిస్తాయి ఈ పరిస్థితుల్లో ఆయా కంపెనీలు విదేశీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గు చూపే అవకాశం తక్కువ. ఇక అమెరికాలో మాస్టర్ పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత హెచ్-1బీ వీసాలకు మారే కమ్యూనిటీలో కూడా భారతీయులే అధికం. ఇప్పుడు ఈ పిడుగురాటి వార్త వారి అవకాశాలకు భారీ గండి కొడుతుంది.

అమెరికా జనాభాలో 15శాతం మనోళ్ళే
ఇక ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం 2025, సెప్టెంబర్ 18 నాటికి అమెరికా జనాభా 34,76,75,122గా ఉంది. ఇది ప్రపంచంలో మూడవ అత్యధిక జనాభా కలిగిన దేశం, పశ్చిమ అర్ధగోళంలో అత్యధిక జనాభా కలిగిన దేశం కూడా. అయితే, 2023 నాటికి అమెరికాలో ప్రవాస భారతీయులు 47.8 మిలియన్లు అంటే 4కోట్ల 70 లక్షల 80వేల మంది ఉన్నట్లుగా, ఆ దేశ జనాభాలో 14.3% ఉన్నారని అంచనా. అది నేటికి 5 కోట్ల జనాభాకు చేరి, ఆ దేశ జనాభాలో 15శాతానికి వచ్చి ఉంటుంది.

అమెరికాకు వలసలు అధికం
అమెరికాకు ప్రపంచ దేశాల వారీగా వలసలను పరిశీలిస్తే, అత్యధికంగా మెక్సికో నుంచి 11 మిలియన్లు, భార‌త్ నుంచి 3.2 మిలియన్లు, చైనా నుంచి 3.0 మిలియన్లు, ఫిలిప్పిన్స్ నుంచి 2.1 మిలియన్లుగా ఉన్నాయి. భారతీయ వలస వాసుల సంఖ్య, ఆ దేశ మొత్తం వలస వాసులలో 6శాతంగా గుర్తించబడ్డారు.

హెచ్-1బీ వీసాల్లో 75శాతం ఇండియన్లే!
అయితే, ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలోని కంపెనీల ద్వారా హెచ్-1బీ వీసాలు పొందిన భారతీయులు 72.3 శాతంగా ఉన్నారు. 2025 నాటికి ఈ శాతం 75శాతానికి చేరింది. ఒక్కో ఏడాదికి కనీసం 2 లక్షల మంది భారతీయులు అమెరికాకు హెచ్-1బీ వీసాలపై వెళుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

అమెరికా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ
అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అమెరికా ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తూనే, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ జోక్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

అగమ్యగోచరంగా అమెరికా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి
2025 ఏడాది రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 3.3%కి పెరిగిందని బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్ (బీఈఏ) తెలిపింది. ఇది మొదటి త్రైమాసికంలో నమోదైన క్షీణత తర్వాత ఒక సానుకూల సంకేతం. అయితే, అమెరికాకు 37 ట్రిలియన్ డాలర్లకు పైగా భారీ అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు తీర్చడానికి వడ్డీల కోసం భారీ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నది. ఇంకోవైపు అమెరికాలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉండటం ఆదేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం. ఇది ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నదనేందుకు ఒక సూచిక. పెరుగుతున్న ప్రభుత్వ అప్పులు అమెరికా ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశ్నించేలా చేస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది కావడంతో, ఇక్కడ వచ్చే చిన్న మార్పులు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున ఉండవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఇది వినియోగదారుల వ్యయం, పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది.

అందుకే ఈ నిర్ణయాలా?
వీటన్నింటి నుంచి బయట పడటానికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవడంతోపాటు, ప్రపంచ దేశాలపై కర్రపెత్తనం చేయాలన్న సంకల్పంతో అమెరికా ఉంది. అందుకే తన చుట్టుముట్టున్న చమురు దేశాలపై యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు. అంతేగాక అధిక పన్నులు కూడా ఇందులో భాగమే. హెచ్-1బీ రుసుము పెంపును కూడా ఇందులో భాగంగానే చూడాలి.

అత్యధిక హెచ్-1బి వాటాలు కలిగిన కంపెనీలు
*హెచ్-1బి వీసా రుసుము సాధారణంగా 2వేల నుంచి 5వేల డాలర్లుగా ఉంటుంది. ప్రస్తుతం దీన్ని లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది ఈ వీసా కార్యక్రమం కింద భారత్ కి చెందిన అనేక కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయి. వేలాది మంది నిపుణులను అమెరికాకు పంపిస్తున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం గణాంకాలు ప్రకారం ఈ ఏడాది జూన్ 30 నాటికి హెచ్-1బి వీసా ఆమోదం పొందిన వాటిల్లో అమెజాన్ (10,044) అగ్రస్థానంలో ఉంది. టీసీఎస్ (5,505), మైక్రోసాఫ్ట్ (5,189) మెటా (5123), ఆపిల్ (4202), గూగుల్ (4,181), కాగ్నిజెంట్ (2,493), జెపి మోర్గాన్ చేజ్ (2,440), వాల్ మార్ట్ (2,390), డెలాయిట్ కన్సల్టింగ్ (2,353), టాప్ 10 జాబితాలో ఉన్నాయి ఇన్ఫోసిస్ (2,002), ఎల్ టి ఐ మైండ్ ట్రీ (1,807), హెచ్ సి ఎల్ అమెరికా (1,728), టాప్ 20 జాబితాలో ఉన్నాయి.

వెంటనే తిరిగి వచ్చేయండి : ఉద్యోగులకు కంపెనీల ఆదేశాలు
అమెరికా బయట ఉన్న హెచ్-1బి, హెచ్4 వీసా దారులు 24 గంటల్లోగా ఆయా దేశాలను వీడి అమెరికాకు రావాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ మెయిల్స్ పంపినట్లు తెలిసింది.

మెటా కంపెనీ తమ ఉన్నత ఉద్యోగులను వీసా చార్జీల పెంపు పై స్పష్టత వచ్చేవరకు అమెరికా ఉంది ఎటు వెళ్లకుండా అమెరికాలోనే ఉండాలని సూచించింది. మరోవైపు హెచ్-1బి, హెచ్4 వీసా దారులుగా అమెరికాలో విధులు నిర్వర్తిస్తున్న వారు మరికొంత కాలం అమెరికాలోనే వేచి ఉండాలని సూచించాయి. అమెజాన్ జేపీ మోర్గాన్ వంటి సంస్థలు కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ చేశాయి.

ఎవరేమన్నారు?

ఒకప్పుడు డాలర్ కంటే మన రూపాయే ఎక్కువ!?
1917లో మన ఒక రూపాయి విలువ 13 డాలర్లకు సమానం. 2014కల్లా ఒక డాలర్ విలువ రూ.63 గా మారింది. ప్రస్తుతం ఒక డాలర్ కు రూ.86.35 లకు సమానంగా ఉంది.
……..
మాకు నైపుణ్యమే ముఖ్యం : ట్రంప్
మాకు అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే కావాలని కోరుకుంటున్నాను. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాం. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని భావిస్తున్నా.
….
ఆధారపడటమే పెద్ద శత్రువు : మోదీ
ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువు. మనమంతా కలిసి ఈ శత్రువును జయించాలి. విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మనదేశం అంతలా విఫలమవుతుంది. అందరం కలిసి ప్రపంచంలోనే భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చాలి. ఇతరులతో కలిసి నడుద్దాం కానీ, ఆత్మాభిమానంతో బతుకుదాం. 140 కోట్ల మంది భారత్ భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయబోం.

ఇండియాపై తీవ్ర ప్రభావం : నాస్కాం
ట్రంప్ నిర్ణయం ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఈ పరిణామాలపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీ (నాస్కాం) అధ్యయనం చేస్తోంది.
……
భారత్ కు టర్బో చార్జ్ : నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్

రెస్పాండెంట్ అమెరికా నిర్ణయం ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. భారతదేశాన్ని టర్బో చార్జ్ చేస్తుంది. అమెరికా తలుపులు మూసుకోవడంతో స్టార్ట్ అప్ కంపెనీలు, కొత్త ఆవిష్కరణలు, పేటెంట్లు, ల్యాబ్స్ అన్ని బెంగళూరు హైదరాబాద్, పూణె, గురుగాం లకు వచ్చేస్తాయి. వికసిత్ భారత్ దిశగా పురోగతికి ట్రంపు నిర్ణయం దోహదం చేస్తుంది.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News