Wednesday, September 16, 2026
31.2 C
Hyderabad

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా మారాయా? భవిష్యత్తు ఆదాయ వనరులను సృష్టించాయా? తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు తమ తీర్పు చెప్పారు. అభివృద్ధి, అవినీతి, అధికార కేంద్రీకరణ వంటి అంశాలు ఎన్నికల ప్రధాన చర్చగా మారాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోవాల్సిన కీలక బాధ్యతను మోస్తోంది. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా అనేక హామీలు అమలు దశలోనే ఉండటం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పుష్కరకాలం పూర్తైంది. 12 ఏళ్ళ ప్రయాణం మాములుదేమీ కాదు. ఈ దీర్ఘ కాలంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం ఆశించిన లక్ష్యాలను సాధించిందా? “నీళ్లు – నిధులు – నియామకాలు” అనే నినాదంతో సాగిన ఉద్యమ ఫలితాలు ప్రజల జీవితాల్లో ఎంత మేరకు ప్రతిఫలించాయి? ఈ అంశాలపై తెలంగాణ మేధావులు, పౌరసమాజం, రాజకీయ వర్గాలు నిష్పాక్షికంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలతో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, సాగు-తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావించారు. కొంతమేర అభివృద్ధి జరిగినా, ఉద్యమ సమయంలో ప్రజలు ఆశించిన సమగ్ర మార్పు కనిపించిందా అనే ప్రశ్న ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరిందని, రాష్ట్ర బడ్జెట్, వివిధ ఆర్థిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా మారాయా? భవిష్యత్తు ఆదాయ వనరులను సృష్టించాయా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలే లేవు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభ అంచనాలు పెరుగుతూ లక్ష కోట్లకు పైగా వ్యయమైంది. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తలెత్తిన సాంకేతిక సమస్యలు ప్రాజెక్టు నిర్మాణం, అవినీతి, మన్నిక, ప్రయోజనాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రజా ధన వినియోగంపై సమగ్ర సమీక్ష అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగాల విషయంలో కూడా ఆశించిన పురోగతి కనిపించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాజకీయ పార్టీలు హామీలతో ఊదరగొట్టాయి. కానీ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. ప్రభుత్వ నియామకాల ఆలస్యం యువతలో నిరాశను పెంచుతోంది.
వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. అయినప్పటికీ రైతులు ఇప్పటికీ మార్కెట్, కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలు, సాగునీటి సమస్యలతో పోరాడుతున్నారు. ప్రతి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురయ్యే ఇబ్బందులు రైతు సంక్షేమంపై ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు భూకబ్జాలు, ఇసుక, మట్టి, గ్రానైట్ అక్రమ తవ్వకాలపై తరచూ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విద్య, వైద్య రంగాల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కొరతపై తరచూ నివేదికలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థల ఖర్చులు సాధారణ కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. నాణ్యమైన విద్య, వైద్యం ప్రతి పౌరుడి హక్కుగా మారాల్సిన పరిస్థితుల్లో ఈ రంగాల్లో ప్రభుత్వ జోక్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది.

రాజకీయంగా చూస్తే తొమ్మిదిన్నరేళ్లపాటు సాగిన బీఆర్ఎస్ పాలనపై ప్రజలు 2023 ఎన్నికల్లో తమ తీర్పు చెప్పారు. అభివృద్ధి, అవినీతి, అధికార కేంద్రీకరణ వంటి అంశాలు ఎన్నికల ప్రధాన చర్చగా మారాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోవాల్సిన కీలక బాధ్యతను మోస్తోంది. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా అనేక హామీలు అమలు దశలోనే ఉండటం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది.

పాలకులు, ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, అవినీతి, జవాబుదారీతనం లోపం, శాఖల మధ్య సమన్వయ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా సేవలు వేగంగా అందించేందుకు పరిపాలనా సంస్కరణలు అత్యవసరంగా మారాయి. అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు. ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పారదర్శక పాలనలతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మేధావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాలు, ప్రజల ఆశలు, ఆశయాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలను ప్రశంసించడం ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు ప్రశ్నించడం కూడా అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యంలో మేధావుల మౌనం సమాజానికి మేలు అసలే చేయకపోగా, కీడు చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం చారిత్రక విజయమే. అయితే రాష్ట్ర ఆవిర్భావం ఒక్కటే అంతిమ లక్ష్యం కాదు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే అసలు లక్ష్యం. రాబోయే సంవత్సరాలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించాలి. అదే సమయంలో ప్రజలు, మేధావులు, పౌరసమాజం ప్రభుత్వాలను నిరంతరం జవాబుదారీగా నిలబెట్టాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమం కలగన్న సమానత్వం, స్వాభిమానం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు నిజంగా సాకారమవుతాయి.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News