Monday, August 3, 2026
26.6 C
Hyderabad

‘మన’ వాదా? ‘మను’ వాదా!?|BJP|BC

BC|బీసీల చెవిలో BJP|బీజేపీ పువ్వేనా?
BC|బీసీలకు POLITICAL|రాజకీయ RISERVATIONS|రిజర్వేషన్లు వద్దా?
ఇది బీజేపీ నిర్ణయమా?
RAMACHANDRA RAO|రామచంద్రరావు అభిప్రాయమా?
CM|REVANTH|రేవంత్ చెబుతోందే నిజమేనా?
MUSLIMS|ముస్లీంల పేరుతో బీజేపీ అడ్డుకుంటోందా?
బీజేపీ DOUBLE|ద్వంద్వ నీతికి పరాకాష్ట
బీజేపీలో గందరగోళం.. బీసీల్లో ఆగ్రహం
దుమారం రేపుతోన్న రామ్ వ్యాఖ్యలు

INDIA|దేశంలో CASTE CENSUS|కుల గణనకు 95 ఏళ్ళు!
MANDAL REPORT|మండల్ నివేదికకు 45 ఏళ్ళు!
CONSTITUTION|రాజ్యాంగమే బీసీ రిజర్వేషన్లకు రాజమార్గం
బలమైన సమూహం బలహీనమైన ప్రాతినిధ్యం
రాజకీయ ప్రాతినిధ్యమే అభివృద్ధికి కీలకం
పార్టీలు సమీక్షించుకోవాల్సిన సమయం
వాస్తవాంశాల ఆధారంగా ADUGU| ‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ అందిస్తోన్న ప్రత్యక కథనం

సమానత్వం, సమాన అవకాశాలు, సమగ్ర అభివృద్ధి ప్రజాస్వామిక రాజ్యాంగ స్ఫూర్తి. దాదాపు అన్ని పార్టీలు ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం చూస్తున్నాం. ఇదే కోవలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలు.. మనం, ‘మన’ అనే వాదాన్ని కాదని ‘మను’ వాదాన్ని బలపరుస్తున్నట్లుగా ఉన్నాయి. ‘బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అవసరమే లేదు. విద్యా, ఉద్యోగాల్లో ఉంటే చాల’ని వికారాబాద్ లో వ్యాఖ్యానించడంపై బీజేపీలోనే గందరగోళం నెలకొన్నది. బీసీ సంఘాలు, వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ‘మేం బీసీలకు వ్యతిరేకం కాదు, ముస్లీంల రిజర్వేషన్లకు వ్యతిరకమంటున్న’ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా, మిగతా బీజేపీ నాయకుల మాటలకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మాటలకు పొంతన లేకపోగా, విరుద్ధంగా కూడా ఉంది. బీసీ రిజర్వేషన్లపై రామచంద్రరావు వ్యాఖ్యలు, బీజేపీ వైఖరికి క్లారిటీ ఇచ్చినట్లా? కన్ఫ్యూజన్ ని మరింతగా పెంచినట్లా? ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు అక్కర లేదని చెప్పే దమ్ము ధైర్యం అదే బీజేపీకి, ఇదే రామచంద్రరావుకు ఉన్నాయా? నిద్రాణంగా బలమైన శక్తిగా ఉన్న బలహీన వర్గాలపై ఎందుకీ అక్కసు?

బీజేపీ సంప్రదాయ పార్టీ. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం. ఆరెస్సెస్ భావజాలానికి ప్రతి రూపం. బ్రాహ్మణ, బనియాల ఇలాకాగా ఉండేది. హిందూయిజాన్ని బలపరిచే చట్రంలో బందీ అయినట్లుగా, కొన్ని అగ్రవర్ణాలకే అనువైన, మిగతా వర్గాలకు అంటరాని పార్టీగా కనిపించేది. అందరి పార్టీగా కాకుండా, కొందరి పార్టీగానే ఉండేది. ఒకప్పుడు ఆరెస్సెస్ కార్యకర్తలు, కరసేవకులే ఆపార్టీకి కార్యకర్తలుగా, పెట్టని కోటలుగా ఉండేవారు. దశలవారీగా మోదీ, అమిత్ షాల చేతుల్లోకి పార్టీ పూర్తిగా చేరాక దాని మూలం మినహా, స్వరూపం సమూలంగా మారుతూ వస్తున్నది. అన్య పార్టీల నేతలను బీజేపీ ఆహ్వానించడం మొదలు పెట్టింది. అనేక మందిని అక్కున చేర్చుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ లను ఏర్పాటు చేసింది. అధికారం వచ్చాక ప్రభుత్వాల్లో, పార్టీ నియామకాల్లో ఎంతో కొంత మేర సామాజిక న్యాయాన్ని కూడా పాటిస్తున్నది. మరి, సమాజంలో సామాజిక న్యాయం గురించి ఎందుకిలా వ్యవహరిస్తున్నది? కేంద్ర నాయకత్వం ఎందుకిలా మౌనంగా ఉంటున్నది? బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే, ఆ క్రెడిట్ తమ బుట్టలో పడే విధంగా చూసుకోవడం సహజమే. అదే వ్యూహాత్మక మౌనం అయితే అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ రకమైన సూచనలు ప్రజలకు, బీసీలకు, పార్టీకి ఇవ్వాలి కదా! అలా ఇవ్వలేకపోతే, ఆ పార్టీకే నష్టం కాదా?

*రామచంద్రరావు వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీగతమా? *
బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదన్న రామచంద్రరావు దృష్టిలో, ప్రజాస్వామ్యంలో ప్రతిభ, కృషి ఆధారంగానే ఎదుగుదల జరగాలని కావచ్చు. కానీ, ఇది భారతదేశ భౌగోళిక, సామాజిక వాస్తవాలకు సరిపోతుందా? అన్నది కీలక ప్రశ్న. ఉన్న రిజర్వేషన్లను తీసేసే సాహసం ఎవరూ చేయలేరు. కానీ, కొత్తగా ఇవ్వగలిగిన స్థానంలో రామచంద్రరావు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఉంది. దానికి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కూడా అన్నది మరవరాదు. ఈ దశలో రామచంద్రరావు వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక పార్టీ నిర్ణయమా? అన్నది తేలాల్సి ఉంది.

బీజేపీ ద్వంద్వ నీతికి పరాకాష్ట
బీసీల విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సరైనవే కానీ రాజకీయాల్లో అవసరం లేదనడం వారి భావోద్వేగాలను రెచ్చగొట్టడమే అవుతుంది. ఒకవైపు బీసీలకు మద్దతిస్తూనే, మరోవైపు తాము ముస్లీం రిజర్వేషన్లను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఎందుకంటున్నారు? అంటే ఇది బీజేపీ ద్వంద్వ నీతికి పరాకాష్ట.

అసలు బీజేపీ వైఖరి ఏంటి?
బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన పార్టీగా, తెలంగాణలో అధికారం కోసం అర్రులు చాస్తున్న పార్టీగా, బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. పలు రాష్ట్రాల్లో బీజేపీ “బీసీ మోర్చా”లను ఏర్పాటు చేసి, వారి మద్దతు పొందేందుకు తెగ ఆరాటపడుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ బీసీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. పైగా కన్వెర్టెడ్ అయినప్పటికీ, ప్రధాని కూడా బీసీనే. బీసీగా ఉండి, 10శాతం కూడా లేని వెనుకబడ్డ అగ్రకులాలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను కేవలం ఏడు రోజుల్లోనే ఇచ్చేశారు.

నిజానికి దేశంలో కులాలవారి జనాభా లెక్కలు ప్రభుత్వం దగ్గర లేనేలేవు. అలాంటప్పుడు అగ్రకుల లెక్కలు.. అందులోనూ వెనుకబడిన వారి లెక్కలు కూడా లేనట్లే కదా! మరి వారికి ఏ లెక్కల ఆధారంగా ఇచ్చినట్లు? బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు పెంచడానికి, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏ లెక్కలు లేక అడ్డం వస్తున్నట్లు?

మండల్ నివేదికకు 45 ఏళ్ళు!
1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మండల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. మండల్ కమిషన్ నివేదిక 1980లో పూర్తయినప్పటికీ, భారత ప్రభుత్వం 1990 ఆగస్టు 7న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అంటే 1980 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 3,743 కులాలను బీసీలుగా తేల్చి, అప్పుడు దేశ జనాభాలో దాదాపు 52% బీసీలు ఉన్నారని అంచనా వేసింది. ఈ అంచనాకు కూడా 45 ఏళ్ళు పూర్తయ్యాయి. తాజాగా బిహార్‌లో ఓబీసీలు, ఈబీసీలు కలిసి మొత్తం బీసీలు 63.13% ఉన్నారని తేల్చారు. 2025లో తెలంగాణలో జరిగిన కులగణన ప్రకారం, ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో బీసీలు 56.33% ఉన్నారని తేల్చారు.

దేశంలో కుల గణనకు 95 ఏళ్ళు!
భారతదేశంలో మొదటి వివరణాత్మక కుల గణన 1871-72లో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. 1881 నుండి 1931 వరకు ప్రతి పదేళ్లకోసారి ఈ గణన కొనసాగింది. 95 ఏళ్ళ తర్వాత 2025లోనే తెలంగాణలోనే మళ్ళీ కుల గణన చేపట్టారు. అంటే ఇంత కాలంగా జనాభాలో సామాజిక అంతరాల అంచనా లేకుండానే సంక్షేమం, అభివృద్ధి, పరిపాలన జరుగుతూ ఉండటం మన పాలకుల నిర్లక్ష్యానికి, దేశ ప్రజల దౌర్భాగ్యానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

రాజ్యాంగమే బీసీ రిజర్వేషన్లకు రాజమార్గం
రిజర్వేషన్ల అవసరాన్ని అర్థం చేసుకోవాలంటే, దేశ చరిత్ర, సమాజ నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి. నిచ్చెన మెట్ల మనువాద వ్యవస్థలో బీసీలు అటు క్షత్రీయులు, వైశ్యులు, ఇటు అతిశూద్రులుగా ముద్ర వేసిన ఎస్సీ, ఎస్టీల మధ్య ఎటుగాకుండా శూద్రులుగా ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం బీసీలు ‘సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాలు.’ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం ఈ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రిజర్వేషన్లకు మార్గం వేసింది.

బలమైన సమూహం బలహీనమైన ప్రాతినిధ్యం
నిజానికి రాజకీయాల్లో నాయకత్వం మాత్రమే ఉంటే సరిపోదు, ప్రాతినిధ్యం కూడా ఉండాలి. రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేని వర్గాలు ఎప్పటికీ ఎదగవు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండీ నేటి వరకు చట్ట సభల్లో బీసీల ప్రాతినిధ్యం అతి తక్కువ. ఎస్సీ, ఎస్టీలకు చట్టబద్ధత ఉంది. వారి రిజర్వేషన్ల స్థానాలను వదిలి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకంటే అతి తక్కువగా ఉన్న అగ్ర వర్ణాలు మిగతా అన్ని అవకాశాలను, ప్రాతినిధ్యాలను పొందుతూ వస్తున్నారు. ఇది ఎవరైనా కాదనలేని తిరుగులేని వాస్తవం.

రాజకీయ ప్రాతినిధ్యమే అభివృద్ధికి కీలకం
రాజకీయ శక్తి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తేనే, వారి సమస్యలు శాసనసభల దాకా వెళ్తాయి. నిధుల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాలు, విద్యావకాశాల్లో న్యాయం జరగడం వారి ప్రతినిధిత్వంపైనే ఆధారపడి ఉంటుంది. బీసీల సమస్యలను మిగతా వారెవ్వరూ అర్థం చేసుకోరు, చేసుకున్నా, పరిష్కరించరు. అందుకే, బీసీ నాయకత్వానికి ప్రాతినిధ్య ప్రాధాన్యతను చట్టబద్ధం చేయడం రాజకీయ సమానత్వానికి మూలస్తంభం.

పార్టీలు సమీక్షించుకోవాల్సిన సమయం
ఈ నేపథ్యంలో బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాలను పునఃసమీక్షించుకోవాలి. బీసీలను ఓటర్లుగా మాత్రమే కాక, వారి ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలి. ఒకవైపు బీసీల ఓట్ల కోసం పాకులాడటం, మరోవైపు వారికే వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం, పార్టీ మౌనంగా ఉండటం ఆ పార్టీకే నష్టం. ఇది బీసీల వాస్తవ సమస్యలను విస్మరించే ప్రమాదకరమైన దృక్కోణం కూడా.
రిజర్వేషన్ల అవసరాన్ని నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడి అభిప్రాయం ఎంత మాత్రమూ కాదు. రామచంద్రరావు వ్యాఖ్యలపై ఇప్పటికైనా బీజేపీ స్పష్టతనివ్వాలి. స్పందించకపోతే, అది బీసీలలో అసంతృప్తిని కలిగించే ప్రమాదముంది. ఒక ప్రజాస్వామిక పార్టీగా, బీజేపీకి సమానత, ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం వంటి విలువలకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ నిర్ణయమే దాని భవిష్యత్తుని తేలుస్తుంది.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News