ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ గిదంత పని కాదని, గా ఊల్లె ఎండా కాలం వత్తే సాలు, గా ఊరు ఊరంతా గా శెట్టు కిందికే పోతదట. గాడనే గుడారాలో, గుడిసెలో ఏసుకుని ఎండా కాలం అయిపోదేదాక ఉంటరట.

ఉత్తర్ ప్రదేస్ ల ఓ ఊరుందట. గా ఊల్లె ఓ కాలువుంది. గా కాలువ పక్కనే వందేండ్ల కంటే పెద్దదైన ఓ పెద్ద శెట్టు గుబురుగుంది. ఎండాకాలంల కూడా పచ్చగ నిగనిగలాడుతూ, సల్లగ నీడనిస్తది. గందుకే గా ఊరంతా గా శెట్టుకిందికే పోయి ఎండా కాలం అయిపోయేదాకా గాడ్నే ఉంటదట. నిజమే కదా, భూతల్లి మనకెన్ని రచ్చణలిచ్చిందో గదా? గవాటిని మనం నాశనం శెత్తానం. కుయ్యో, మొర్రో అంటానం.

