Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

ఈ నిరీక్షణ ఇంకెన్నాళ్ళు?|CONGRESS

POSTS|పదవుల పందేరానికి తగవుల తందానా!?
-ఖరారైన జాబితా…విభేదాల వల్లే వాయిదా!
-హస్తినకు చేరినా…ఏకాభిప్రాయం కుదిరేనా?
-నేడు DELHI|ఢిల్లీకి CM|సీఎం, DCM|డిసిఎం, MINISTERS|మంత్రులు, PCC CHIEF|పీసీసీ చీఫ్

టీపీసీసీ పదవుల పందేరంపై ప్రతిష్టంభన ఆ పదవులు ఆశిస్తున్న వారిని అసహనానికి గురి చేస్తున్నది. ఆందోళన కలిగిస్తున్నది. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేండ్లు కావస్తున్నది. టీపీసీసీకి కొత్త చీఫ్ వచ్చి 9 నెలలైనా ఇంకా ఈ పురిటినొప్పులేంటి? అయితే నార్మల్, కాకపోతే సిజేరియన్, ఏదో ఒకటి చేసేయాలి కదా? రాష్ట్ర స్థాయిలో నాయకత్వం ఏకతాటిపై లేకపోవడం, పట్టుదలలు పంతాలకు పోవడం, అధినాయకత్వం నాన్చుడు ధోరణి వల్ల ఈ పదవుల పందేరం తగువుల తందానాలాగా మారిపోయింది. మరోవైపు మంత్రి వర్గ విస్తరణలా మారుతుందా?

ఢిల్లీ/హైదరాబాద్, మే 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నది. డిసెంబర్ 3న అధికారంలోకి రాగా, డిసెంబర్ 7న సీఎం ప్రమాణ స్వీకారం చేయగా, సెప్టెంబర్ 6, 2024న పీసీసీకి చీఫ్ ని నియమించిన పార్టీ, ఎట్టకేలకు సంస్థాగత నిర్మాణం వైపు ద్రుష్టి సారించింది. ఈ ప్రక్రియను సుదీర్ఘం చేయడం, దరఖాస్తులను ఆహ్వానించడం, ఫక్తు సంప్రదాయంగా పదవుల కోసం పైరవీలకే అలవాటు పడ్డ కాంగ్రెస్ కేడర్ కు అస్సలు నచ్చడం లేదు. అదో ప్రహసనంగా మారింది. మొత్తానికి ఆ ప్రక్రియ పూర్తైంది. పీసీసీ స్థాయిలో అధ్యక్షుడితోపాటు సీఎం, డిసీఎం, మంత్రులు, టీపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ లు మల్లగుల్లాలు పడి ఎట్టకేలకు టీపీసీసీ కొత్త కార్యవర్గ తుది జాబితాను సిద్ధం చేశారు. యథావిధిగా పార్టీ అధినాయకత్వానికి పంపించారు.|CONGRESSPOSTS|CM|DCM|MINISTERS|PCC CHIEF|

ఫైనల్ అయిన జాబితాపై మళ్ళీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లోనేగాక, ఆయా పదవులకు పేర్లు ఖరారైన నేతలు కూడా నాకు అది వద్దు, ఇదే కావాలని, ఇది వద్దు, అదే కావాలనే వివాదాలు పడుతున్నారు. కాంగ్రెస్ కల్చర్ ను మరోసారి గుర్తు చేస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. దీంతో ఖరారైన జాబితాను పక్కన పెట్టేశారు. ఈ విషయమై టీపీసీసీ చీఫ్ ని ఢిల్లీకి పిలపించుకుని మరీ చర్చించారు. అయినా తేలకపోవడంతో, చివరకు ఇవ్వాళ, రేపు ఢిల్లీలోనే ఉండేటట్లు రమ్మని టీపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, చీఫ్ మహేశ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, డీసీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులను పార్టీ ఆదేశించింది.|CONGRESS|POSTS|CM|DCM|MINISTERS|PCC CHIEF|

ఇదిలావుంటే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక పార్టీ పదవుల కోసం ఎదురుతెన్నులు కొనసాగుతున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన అధికారం, అటు పార్టీ పదవులు రాక, ఇటు ప్రభుత్వ పదవులు లేక కాంగ్రెస్ నేతలు ఆకలిగొని అవురావురని ఉన్నారు. ఈ దశలో ఖరారైన జాబితా కూడా ప్రకటనకు నోచుకోకపోవడంతో ఖద్దరు లీడర్లలో అసహనం వెల్లువెత్తుతోంది. కార్యవర్గ పదవులు ఆశిస్తున్న వారికంటే వారికి పదవులు ఇప్పిస్తున్న టీపీసీసీ నాయకత్వం, మంత్రుల మధ్యే పొసగకపోవడం అత్యంతగా పార్టీని ఇరుకున పెడుతున్నది.
మరి ఇప్పటికైనా టీపీసీసీ కొత్త కార్యవర్గం ఖరారవుతుందా? రెండు రోజుల కసరత్తు ఈ కాన్పుని కానిస్తుందా? చూడాలి.|CONGRESS|POSTS|CM|DCM|MINISTERS|PCC CHIEF|

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News