Friday, September 25, 2026
31.9 C
Hyderabad

బహుజన జీవన తత్వమే ‘బసవపురాణం’|BASAVA PURANAM

-ఆదికవి పాల్కురికి సోమనాథుడి సాహిత్యం విశ్వవ్యాప్తం
-ఘనంగా సోమనాథ కళా పీఠం పురస్కార ప్రదానోత్సవం

పాలకుర్తి, డిసెంబర్ 31(అడుగు న్యూస్):తెలంగాణ ఆదికవి, బహుభాషా కోవిదుడు. పాల్కురికి సోమనాథుడు రచించిన ‘బసవపురాణం’ బహుజనుల జీవన తత్వాన్ని ప్రతిబింబించే మహత్తర పురాణమని శ్రీలేఖ సాహితీ సంస్థ అధ్యక్షుడు డా. టి. శ్రీరంగ స్వామి అన్నారు. సోమనాథ కళా పీఠం ఆధ్వర్యంలో పాలకుర్తి సిద్ధార్థ విద్యాలయంలో బుధవారం నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమానికి పీఠం అధ్యక్షుడు డా. రాపోలు సత్యనారాయణ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా శ్రీరంగ స్వామి మాట్లాడుతూ, 12వ శతాబ్దానికి చెందిన గొప్ప తెలుగు కవిగా, విప్లవాత్మక రచయితగా పాల్కురికి సోమనాథుడు చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. తెలుగు, కన్నడ, సంస్కృతం, మరాఠీ, తమిళ భాషల్లో అపార పాండిత్యం సంపాదించిన సోమనాథుడు ‘బసవపురాణం’, ‘పండితారాధ్య చరిత్ర’ వంటి తన రచనల ద్వారా వీరశైవ మత వ్యాప్తికి విశేషంగా కృషి చేశారన్నారు. ప్రజల భాషలో రచనలు చేసి తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. వర్ణ వ్యవస్థను, కఠిన ఆచారాలను వ్యతిరేకిస్తూ భక్తి మార్గం ద్వారా సమానత్వాన్ని బోధించిన కవిగా సోమనాథుడు నిలిచారని చెప్పారు. భక్తిని సామాజిక సమానత్వంతో మేళవించి ప్రజల హృదయాలకు చేరువ చేసిన విప్లవ కవి, రచయితగా ఆయన పాత్ర అపూర్వమని అన్నారు. ఈ ప్రాంత మట్టి పరిమళంలోనే సోమనాథుడి తత్వం నిండి ఉందని, ఆ తత్వాన్ని అందిపుచ్చుకుంటూ యువత సాహిత్య రంగంలో ముందుకు సాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. పాలకుర్తి ప్రాంతంలో సోమనాథుడి స్పూర్తితో ఎన్నో బహుజన, సామాజిక, సమానత్వ పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు.

పురస్కారాల ప్రదానం
అనంతరం సోమనాథ కళా పీఠం పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమనాథ సాహిత్య పురస్కారాన్ని డా. దివాకర్ల రాజేశ్వరికి, సోమనాథ సామాజిక శోధన పురస్కారాన్ని డా. పండితారాధ్యుల సీతకు, సోమనాథ రంగస్థల పురస్కారాన్ని మోహన్ సేనాపతికి అందించారు. పందిళ్ల శేఖర్ బాబు రాజయ్య శాస్త్రి స్వచ్ఛంద భాషా సేవా పురస్కారాన్ని కోడిహల్లి మురళీమోహన్‌కు, వీరమనేని చలపతిరావు సాహిత్య పురస్కారాన్ని డా. చెన్నమనేని పద్మకు, బండారు తమ్మయ్య సాహిత్య పురస్కారాన్ని డా. దామెర వెంకట సూర్యారావుకు ప్రదానం చేశారు. అలాగే డా. రాపోలు సోమయ్య ప్రతిభా పురస్కారాన్ని బొడిగె సూర్య ప్రకాష్‌కు, ‘పద్య ప్రవాహ’ బిరుదును డా. కె. బాలస్వామికి అందించి ఘనంగా సన్మానించారు.

 

పలు గ్రంథాల ఆవిష్కరణ
ఈ కార్యక్రమంలో భాగంగా డా. సత్తెనపల్లి బాబు రచించిన ‘వీరశైవ సాహిత్యం–సామాజిక దృక్పథం’, డా. కె. బాలస్వామి రచించిన ‘ఓం నమః శివాయ’ గ్రంథాలని ప్రముఖులు ఆవిష్కరించి సాహితీ వేత్తలకు అందజేశారు. ఈ గ్రంథాలు వీరశైవ సాహిత్యాన్ని సామాజిక కోణంలో విశ్లేషిస్తూ నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని వక్తలు పేర్కొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన కీ.శే. వైట్ల లక్ష్మీపతి మనుమరాలు కుమారి స్నిషిక వైట్ల, సిద్ధార్థ విద్యాలయ విద్యార్థిని పెందోట శ్రేష్టల కూచిపూడి స్వాగత నృత్యం సభికులను అలరించాయి. విద్యార్థినులు పఠించిన సోమనాథుని పద్యాలు, వారు ప్రదర్శించిన జానపద నృత్యాలు సభను ఉత్సాహభరితంగా మార్చాయి.

ఈ కార్యక్రమంలో బసవకృప పత్రిక సంపాదకుడు ప్రొఫెసర్ ఆవుటి జగదీష్, తెలంగాణ హైకోర్టు న్యాయవాది హేరూర్ విజయకుమార్, శోభ దంపతులు, దేవస్థాన ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న, వీరశైవ లింగాయత్ రాష్ట్ర నాయకుడు సంకటాల సోమేశ్వర్, పోతన సాహిత్య కళా వేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేందర్, దేవస్థానం మాజీ చైర్మన్ ఎ. సోమేశ్వర్ రావు పాల్గొన్నారు. అలాగే సోమనాథ కళా పీఠం ఉపాధ్యక్షుడు, ‘అడుగు’ డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఇమ్మడి దామోదర్, వీరమనేని వేంకటేశ్వర రావు, సంయుక్త కార్యదర్శులు జక్కుల రవీందర్, మామిండ్ల రమేష్ రాజా, కోశాధికారి రాపాక విజయ్, కార్యవర్గ సభ్యులు రాపాక రమేష్, బజ్జూరి వేణుగోపాల్, డా. రాపోలు వెంకటేశ్వర్లు, గుమ్మడిరాజుల సాంబయ్య, మెరుగు మధుసూదన్, గూడూరు లెనిన్, మార్గం సాయి సందేశ్ తేజ పాల్గొన్నారు. సిద్ధార్థ విద్యాలయం కరస్పాండెంట్ జక్కుల ఊర్మిళ, ఉపాధ్యాయులు జీవంజి దామోదర్, బుర్రి జయలక్ష్మి, విద్యార్థినీ విద్యార్థులు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest News

అడుగుకు అభినందనలు!|ADUGU DIGITAL MEDIA

మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు! పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన...

ఆరోగ్యకరమైన భవిష్యత్తుల కోసం ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ!|PHARMACIST|HEALTH

(ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం : 25 సెప్టెంబర్ 2026) ప్రపంచంలో ఔషధం అవసరం లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఔషధ ప్రయోక్తలైన ఫార్మసిస్ట్ లు ప్రతి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఔషధాలతో పాటు...

మూడో బిడ్డకు బంపర్ ఆఫర్!?|ADUGU TRENDS

ఎనకటికి ఎంత ఎక్కువ మందిని కంటే గంత ఇలువ. అంత గౌరవం. ఒక్కొకల్లు డజను మందిని కనేది. గంపెడు మందితో ఇల్లు కళకళలాడేది. ఎంత ఎక్కువ మంది ఉంటే, గా ఇంటికి అంత...

శాశ్వత సభ్యత్వంలో భారత్ ముందడుగు!?|EDITORIAL

భారత్‌కు శాశ్వత సభ్యత్వం సాధించాలంటే దౌత్య మద్దతుతోపాటు ఐ రా స చార్టర్‌ సవరణకు అవసరమైన ప్రక్రియలు పూర్తికావాలి. తాజా యూరప్‌ మద్దతు ఆశలను పెంచినా, తుది ఫలితానికి మరింత అంతర్జాతీయ సమ్మతి...

సెప్టెంబర్ 25, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 09.53 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం శతభిషం ఉదయం 11.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శూల పగలు 03.50 వరకు ఉపరి గండ కరణం గరజి ఉదయం 09.43...

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News