అమెరికా ప్రభుత్వం మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాలు విధించిన ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. అమెరికా ఫ్యూచర్స్ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. జపాన్, దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు మూడు శాతం వరకు నష్టపోయాయి. అమెరికా మార్కెట్ల ప్రభావం ఆసియా, యూరోప్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. భారతీయ మార్కెట్లకు సూచీగా వ్యవహరించే గిఫ్ట్ నిఫ్టి 200 పాయింట్ల మేర నష్టపోయింది. ట్రంప్ తాజా ఆర్థిక నిర్ణయాలు పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచాయి. ఫలితంగా బడ్జెట్ ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ తీవ్రతరం కావచ్చన్న భయాలు, గ్లోబల్ ఆర్థిక మందగమనం సూచనలు మార్కెట్లను భారీగా దెబ్బతీశాయి.

