తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ కార్ రేసు కేసు తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న ఐఏఎస్ దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డు చేసింది. దాదాపు ఏడు గంటలపాటు ఏసీబీ అధికారులు దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన తర్వాత, ఈ ఆధారాలను పరిగణనలో కి తీసుకొని విచారణ ప్రారంభించారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో దాన కిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బట్టి, ఏసీబీ అధికారులు కేసును మరింత లోతుగా పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. స్టేట్‌మెంట్ ఆధారంగా, దాన కిషోర్ నుండి పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ ప్రకటించింది. ఇవి కేసులో మరిన్ని వివరాలను వెలుగులోకి తెచ్చే అవకాశాన్ని కల్పిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

