
పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే గడ్డిని మనిసే తింటే..!? ఆలోసించడానికే ఆగంగుంది కదా? కానీ, నిజంగనే ఓ మనిసి గడ్డి తిన్నడు.! సాటుమాటుగ కాదుల్లా… గా ఊరి జనం ముందే కసాపిసా నమిలిండు. గాయినె గా గడ్డి తింటాంటే, కొందరు ఈడియ కూడ తీసిండ్రు. ఇగ గది గిప్పుడు నెట్టింట మస్తు చక్కర్లు కొడ్తాంది. ఎక్కడ జరిగిందో గనీ, గది సూసినోల్లు ఆశీరపోతాండ్లు.! గప్పుడెప్పుడో కరువొత్తే, మనుసులు రేగడి మట్టి తిని బతికిండ్లట.! గట్లనే మల్లా కరువొస్తే గా గడ్డి తినే బత్తరా ఏంది? ఏ తియ్, కనీ, గా కరువొత్తే గీ గడ్డి కూడా దొరకదు కాదే.!

