సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట.

గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త కన్నప్ప నోటిలో తెచ్చిన నీటితో శివలింగాన్ని అభిషేకించిండట. రుసి సూసిన మాంసాన్ని నైవేద్యంగ పెట్టి, కాల్లతోటి, చెప్పులతోటి లింగాన్ని తాక్కుంట పూజించిండట. కంటి నుండి రత్తం వత్తే, తన కంటినే పీకి గా శివ లింగానికి పెట్టే సాహసం శేసిండంట. గిదంతా ఎందుకంటే…
గా రాజస్తాన్ రాస్ట్రం బికనేర్ కు శెందిన భక్తులు యినూత్నంగా యిసిత్రంగా శివ లింగాన్ని తయారు శేసిండ్రు. అవు పెండ, మట్టితోటి 11 అడుగుల శివలింగాన్ని శేసిండ్రట. కొందరు మగోల్లతో కలిసి 20 మంది ఆడోల్లు నెలన్నర కట్టపడి గా లింగాన్ని దిద్దిండ్రట. ఓం, స్వస్తిక్ లను కూడ అలంకరించిండ్రట. ఇగ శ్రావన మాసం గనుక పూజలు కూడా శేత్తాండ్రట.

