ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా బసిరెడ్డిపల్లెల జరిగింది. గదేందో సూద్దాం పదండ్రి.

మందు సీసాల కాటన్లను మోసుకుకపోతున్న వ్యానొకటి గా బసిరెడ్డిపల్లె దగ్గర బోల్తా పడింది. ఇగ గండ్ల ఉన్న సీసాల కాటన్లు కింద పడ్డయి. ఇగ గిదే సందని, గా సుట్టుముట్టున్న జనం గాడికి పోయిండ్రు. సాయం శేయాల్సిందిపోయి, సాంతం ఎత్తుకపోయిండ్రు. ఎవ్వలికి అందిన కాడికి వాళ్లు గా సీసాలను కాటన్లల్ల, తువ్వాలల్ల, లుంగీల్ల, ఇగ ఎట్లబడితే గట్ల మోసుకపోయిండ్రు. గా వ్యానాయినె ఆపినా ఎవ్వలూ ఆగలే. గా వ్యాన్ల ఉన్న గా మొత్తం మందు సీసాల్ని మోసిండ్రు. ఇగ గా వ్యానాయిన మందు పోయి లబోదిబోమంటుంటే, గా మందు సీసాలు మోసినోల్లు మస్తు మజా చేసుకుంటాండ్లు.!

