సినీ హీరో అల్లు అర్జున్ పై సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేసు నడుస్తుండగా, పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుష్ప 2లో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా హీరో మూత్రం పోశాడని.. కొన్ని సీన్స్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

