Saturday, September 5, 2026
27.6 C
Hyderabad

ప్రణాళికలతో ‘సాగ’డమే శ్రేయస్కరం|EDITORIAL

నీటి నిర్వహణలో స్పష్టత, ప్రాధాన్యతా క్రమం, కార్యాచరణలే అభివృద్ధికి అసలైన బలమైన పునాదులు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాకుండానే కొత్త ప్రతిపాదనలను, ప్రణాళికలను సిద్ధం చేయడం, రాజకీయ వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తించడం మామూలైపోయింది. ఇది సాగు, మంచినీటి వంటి జీవనాధార విధానాలలో సరైన పంథా కాదు.

పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు పదేళ్ళైనా పూర్తికాకపోవడం ఆందోళనకరం. దీంతో ప్రాజెక్టు వ్యయభారం పెరుగుతూ కాలయాపనకు గురవుతోంది. ఏడాదికేడాది నిర్మాణ ఖర్చులు పెరుగుతుండగా, ఆశించిన ప్రయోజనాలు నెరవేడంలేదు. తాజాగా 2027 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు, కానీ, దానిక నుగుణంగా దశలవారీ కార్యాచరణ, నిధుల సమీకరణ, పారదర్శక అమలు అవసరం. పోలవరం పూర్తయితేనే సాగు, తాగునీరు, వరద నియంత్రణ, జలవిద్యుత్ వంటి అనేక ప్రయోజనాలు సాకారం అవుతాయి.

ఇదిలా ఉండగా, నల్లమల సాగర్ ప్రాజెక్టు వంటి కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చి, ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు, ఉద్రిక్తతలకు తావివ్వడం సముచితం కాదు. నీటి విషయాలు భావోద్వేగాలతో కాకుండా, శాస్త్రీయ అవగాహనతో, పరస్పర ప్రయోజనాలు, సహకారం, గౌరవంతో చర్చించాల్సినవి. నదీజలాల వినియోగంపై సంయుక్త సాంకేతిక కమిటీలు, డేటా ఆధారిత చర్చలు, పారదర్శక ఒప్పందాలు ఉండాలి. పరస్పర ఆరోపణలు, రాజకీయ ప్రయోజనాలకు తోడ్పడవచ్చు కానీ, ఆయా రాష్ట్రాలకు, రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చవు.

అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, విచారణలు, దోషులు, శిక్షలు వంటివి వేగంగా తేల్చాల్సినవి ఆలస్యమవడం రాజకీయ సంకల్ప లోపం. అయితే, విమర్శలు చేయడం కంటే, సాంకేతిక లోపాలుంటే సమీక్షించి సరిదిద్దడం అవసరం. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులను రాజకీయ ప్రయోజనాల వాదోపవాదాల బలి పీఠం మీద నిలబెట్టడం సమంజసం కాదు.

ఇటీవల నీటి వినియోగంపై కొత్త పాలసీ, రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు వంటి వార్తలు చర్చనీయాంశమయ్యాయి. నీటి సరఫరా ఖర్చులకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు విధించాలనే ఆలోచన వస్తున్నది. నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ వాదనలో కొంత తార్కికత ఉన్నప్పటికీ, సాగునీటిపై అదనపు భారం రైతులకు పెనుభారమవుతుంది. ఇది రైతుల వ్యతిరేకతకు దారి తీసే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం మంచినీరు, సాగునీరు, జలవిద్యుత్, పరిశ్రమల ప్రాధాన్యతా క్రమాన్ని పాటించాలి. వ్యవసాయ రంగం ఇంకా అస్థిర పరిస్థితుల్లోనే ఉండగానే, పరిశ్రమలకు ముందస్తు ప్రాధాన్యం ఇవ్వడం ఉపాధి అవకాశాలు పెంచుతాయి కానీ, దేశ, రాష్ట్రాల ప్రగతికి సరైన దశ, దిశను నిర్దేశించలేవు.

రైతాంగం లాభాల బాట పట్టే విధంగా, నీటి వినియోగాన్ని విరివిగా వినియోగించే వరిసాగు తగ్గించి ఉద్యాన పంటలు, తృణ ధాన్యాలు ప్రోత్సహించాలనే సూచనలు సూత్రప్రాయంగా మంచివే. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కాలానుగుణ అవసరం. అయితే భూసార అనుకూలత, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులు, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రైతులకు నష్టదాయకం. పంటల మార్పు ఒక దీర్ఘకాలిక వ్యూహంగా, ప్రోత్సాహకాలతో, అవగాహన కార్యక్రమాలతో అమలు చేయాలి. హడావుడిగా కాదు.

రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి అనేక నదులు, వేలాది చెరువులు ఉన్నా వాటి సామర్థ్య వినియోగం పూర్తిస్థాయిలో జరగడం లేదు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం, పరిగెత్తే నీటిని నిల్వ చేయడం, చెరువుల పునరుద్ధరణ, కాల్వల ఆధునీకరణ వంటివేవీ జరగడంలేదు. ‘నడిచే నీటిని నిలబెట్టాలి. నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి’ అనే ఆలోచన ఇప్పటికైనా కార్యరూపం దాల్చాలి.

రాజకీయాలకంటే ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం, పరిపాలనా దృఢత్వం అవసరం. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పారదర్శకంగా జల విధానం, రైతు కేంద్రంగా నిర్ణయాలు, రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక సయోధ్యలే నీటి వివాదాలకు శాశ్వత పరిష్కార మార్గాలు. సమగ్ర నీటి యాజమాన్య ప్రణాళికతోనే వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు సుసాధ్యం. లేకపోతే కొత్త ప్రతిపాదనలు, పాత వివాదాలు, పెరుగుతున్న వ్యయభారాలే మిగిలిపోతాయి. పక్కా ప్రణాళికలు, ప్రాధాన్యతా క్రమంతో ‘సాగ’డమే శ్రేయస్కరం.

Latest News

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు.. పదవులపై నాకు సోకు లేదు తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News