CJI|సీజేఐ గవాయ్‌పై Lawyer|లాయర్ దాడి యత్నం
సుప్రీంకోర్టులో సోమవారం సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై ఒక న్యాయవాది బూటుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ ఆగ్రహంతో లాయర్ ఈ చర్యకు దిగినట్లు సమాచారం. అయితే అక్కడున్న ఇతర న్యాయవాదులు అతడిని వెంటనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో సుప్రీంకోర్టు పరిసరాలు కొంతసేపు ఉద్రిక్తంగా మారాయి. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆ లాయర్‌ను బయటకు తరలించారు. ఈ ఘటనపై సీజేఐ గవాయ్ స్పందిస్తూ, ఇలాంటి దాడులు, బెదిరింపులు నన్ను భయపెట్టలేవు. చట్టం ముందు అందరూ సమానమే అని స్పష్టం చేశారు. ఈ సంఘటనపై న్యాయవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

