ఇగ ఏటీఎంల ఏముంటది? ఓ మిషిని ఉంటది. గదాంట్ల ఏముంటయి? రుపాలుంటయి. మరిగ గిదీంట్ల ఏమున్నది ముచ్చట? ఉందుంది.. గదేందో మీరే సూడుండ్రి. సదువుండ్రి.

గా ఏటీఎంల ఓ మనిసికి ఇంకో మనిసి సవురం శేత్తాండు. మిషిని ఉండాల్సిన సోట సవురం కుర్సీ కనిపిత్తాంది? గిదేం యిచ్చెంత్రమో అర్థం గాక జనం తల గొక్కుంటాండ్రు. బొచ్చు పీక్కుంటాండ్రు. ఇగ గిదీన్ని గా నెట్టింట్ల పెట్టి తెగ వైరల్ శేత్తాండ్రు. గక్కడ గింతకుముందు ఎస్బీఐ ఏటీఎం ఉండేది. గది కాస్త ఖాళీ చేసిండ్రు. ఇగ గా ఇంటాయినె గదాన్ని ఓ సౌరం చేసేటాయనకు కిరాయికిచ్చిండు. ఇగాయనె, గా ఏటీఎం బోర్టు మార్వకుండనే, కటింగ్ గదేనుల్ల సవురం సేసుడు మొదలు పెట్టిండు. ఇగ బోర్డు సూత్తె ఏటీఎం కనిపిత్తాంది. లోపల సూత్తె సౌరం శేత్తాయినె కనిపిత్తాండు. ఇగ గీ ముచ్చట.. బీహార్ రాస్ట్రం పాట్నాలోని దానాపూర్ లో జరిగింది.

