Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

ఏ మానవ కళ్యాణానికి… ఈ మానవ హననం, మారణహోమం?|EDITORIAL

పశ్చిమాసియాలో దద్దరిల్లుతున్న యుద్ధం ఎప్పటికి ముగిసేను? యుద్ధాన్ని రాజేసి, ఆజ్యంపోసిన అమెరికా చెబుతున్నట్లు ఐదారు నెలలు సాగితే, ఇరాన్, ఇజ్రాయెల్ మిగతా మిత్ర దేశాల గతేం కాను? ఈ యుద్ధ ప్రభావంతో విలవిలాడుతున్న ప్రపంచ వ్యాప్తంగా దేశాలు, వాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక సంగతేంకాను? ఈ దురహంకార, దుస్సాహస గుత్తాధిపత్యానికి విరుగుడే లేదా? అంతా బలి కావాల్సిందేనా? ఏమిటీ అమెరికా ఆరాచకం? ఏ మావన కళ్యాణానికి, ఈ మానవ హననం, మారణహోమం? అమెరికా ప్రజలెన్నుకునే అధ్యక్షులే ఇలా ఉంటున్నారా? లేక ఆ ప్రజల మానసిక స్థితి కూడా ఇంతేనా? ఇదిలాగే కొనసాగితే, ప్రపంచ దేశాలు రెండుగా విడివడి, పోటీ పడి, పోరాట పడి, మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా? అదే జరిగితే ఈ భూమి మీద ఏం మిగులుతుంది? ఒకవేళ మిగిలినవారు మిగిలిన మనుషుల కలేబరాల నసినుసిని తినే బతుకుతారా? మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదాల నుంచే ఇంకా కోలుకోని ఈ భూమండలం, మూడో ప్రపంచ యుద్ధాన్ని భరించగలదా? ఇదంతా నిజంగానే యుగాంతానికి దారితీస్తుందా? ఇవీ ప్రపంచ మానవాళి మొదళ్ళని పదేపదే అదేపనిగా తొలుస్తున్న సమాధానం లేని ప్రశ్నల శరపరంపర.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పశ్చిమాసియాలో దద్దరిల్లుతున్న యుద్ధం ఎప్పటికి ముగిసేను? యుద్ధాన్ని రాజేసి, ఆజ్యంపోసిన అమెరికా చెబుతున్నట్లు ఐదారు నెలలు సాగితే, ఇరాన్, ఇజ్రాయెల్ మిగతా మిత్ర దేశాల గతేం కాను? ఈ యుద్ధ ప్రభావంతో విలవిలాడుతున్న ప్రపంచ వ్యాప్తంగా దేశాలు, వాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక సంగతేంకాను? ఈ దురహంకార, దుస్సాహస గుత్తాధిపత్యానికి విరుగుడే లేదా? అంతా బలి కావాల్సిందేనా? ఏమిటీ అమెరికా ఆరాచకం? ఏ మావన కళ్యాణానికి, ఈ మానవ హననం, మారణహోమం? అమెరికా ప్రజలెన్నుకునే అధ్యక్షులే ఇలా ఉంటున్నారా? లేక ఆ ప్రజల మానసిక స్థితి కూడా ఇంతేనా? ఇదిలాగే కొనసాగితే, ప్రపంచ దేశాలు రెండు విడివడి, పోటీ పడి, పోరాట పడి, మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా? అదే జరిగితే ఈ భూమి మీద ఏం మిగులుతుంది? ఒకవేళ మిగిలినవారు మిగిలిన మనుషుల కలేబరాల నసినుసిని తినే బతుకుతారా? మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదాల నుంచే ఇంకా కోలుకోని ఈ భూమండలం, మూడో ప్రపంచ యుద్ధాన్ని భరించగలదా? ఇదంతా నిజంగానే యుగాంతానికి దారితీస్తుందా? ఇవీ ప్రపంచ మానవాళి మొదళ్ళని పదేపదే అదేపనిగా తొలుస్తున్న సమాధానం లేని ప్రశ్నల శరపరంపర.

అసలీ యుద్ధ సంక్షోభానికి కారణాలేంటి? ఇరాన్ అణు కార్యక్రమమేనని అమెరికా బుకాయిస్తోంది. అహంకార ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ అణు సామర్థ్యాలను తమ భద్రతకు ముప్పుగా ప్రకటించి యుద్ధానికి దిగాయి. అణు ప్రయోగంలో అణువంతైనా నిజం లేదని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆగత్యమే తప్పమే మరేం లేదని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ పెంచుతునన దాడుల ఒత్తిడికి ప్రతిగా, అది సైనిక దాడుల తీవ్రతను పెంచుతూపోతోంది.

ఒకవైపు బ్రిటన్ తదితర మిత్రదేశాలు అమెరికా, ఇజ్రాయెల్ కు సహకరిస్తుండగా.. చైనా, రష్యా వంటి దేశాలు ఇరాన్‌కు మద్దతు ప్రలకడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. ఒకవేళ ఈ దేశాలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయే ప్రమాదం పొంచిఉంది.

ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో అత్యంత కీలకాంశం చమురు సరఫరా. ప్రపంచ చమురు రవాణాలో కీలక ఏకైక మార్గం హార్మూజ్ జలసంధి యుద్ధసంధిలో నిషేధానికి గురైంది. ప్రపంచానికి 20% చమురు ఈ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరగడం ఖాయం. ఇప్పటికే పలు దేశాల్లో ఇంధన ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నాయి.

ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు కూడా అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు గురు చేస్తోంది. తనాంజ్ న్యూక్లియర్ కేంద్రం వంటివి దాడులకు గురైతే రేడియేషన్ పెరిగే ప్రమాదం ఉంది. అది కేవలం ఇరాన్‌కే కాకుండా చుట్టుముట్టు దేశాలకు కూడా దాని ప్రభావం పడుతుంది. అందుకే అణు కేంద్రాల భద్రతపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆహార ధాన్యాలు, నూనెలు, ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజల జీవనంపై ప్రభావం పడుతుంది.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై కూడా ఈ యుద్ధ ప్రభావం మరింత తీవ్రం. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌లో ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక సంక్షోభం తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధం ప్రత్యక్షంగానేగాక, పరోక్షంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితాలను, ఆయా దేశాల ఆర్థిక స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

ఇలాంటి సంక్షోభంలోకి కూరుకుపోకముందే, ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఆపే చురుకైన రాజనీతి పాత్రను పోషించాలి. యుద్ధం ద్వారా ఏ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కాకపోగా, మరింత పెరిగుతాయని గత యుద్ధాల చరిత్ర స్పష్టంగా చెబుతోంది. కాబట్టి చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్ని దేశాలు సంయమనం పాటించాలి. పరువు, ప్రతిష్ఠలు, బాంబులు, యుద్ధాల బల ప్రదర్శనలు పక్కన పెట్టి శాంతి దిశగా అడుగులు వేయాలి. సహనాన్ని మించిన పరిష్కారం, శాంతిని మించిన సౌఖ్యం లేదని అంతా గుర్తించాలి. యుద్ధాన్ని మొదలు పెట్టడం కంటే, కొనసాగించడం, ముగించడమే అసలైన పరీక్ష.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News