ఎవలైనా దేవుడ్ని ఏం కోరుకుంటరు? గా కట్టాలు ఎడబాపమంటరు. కాదంటే కాసిన్ని సిరి సంపదిలయ్యమని అడుక్కుంటరు. ఇంకొందరైతే ఆరోగ్యం, సుఖసంతోషాలు, పశాంతమై జీవితం కావాలని కోరుకుంటరు. కనీ, గీ భక్తుడు ఏం కోరుకున్నడో సూడుండ్రి.

గా ఉత్తర కర్ణాటకల సవదత్తి ఎల్లమ్మ గుడి ఉంది. గా గుడికి మత్తుగ భక్తులు పోతుంటరు. కట్న కానుకలు సదివిపిత్తరు. హుండీల్ల ఏత్తరు. ఇగ గవాటిని లెక్కపెడతాంటే ఒక భక్తుడు రాసేసిన ఓ శీటీ దొరికింది. గండ్ల గా భక్తుడు ఏం రాసి పెట్టిండంటే.. ‘అమ్మా! తల్లీ! యల్లమ్మ దేవీ! మా ఇంట్ల నల్లులు బాగున్నయి. గా నల్లులు ఇంట్ల నుంచి బయటకు పోయేటట్లు శెయ్యి. ఇగ నీ గుడికొచ్చి పండ్లు, కాయలు ఇచ్చి పూజలు శేసుకుంట.’ ఇగ గిది సూసిన గా గుడోల్లే ఆశీర పోయిండ్రు. ముక్కుమీద యేలోసుకొని, గిదేం కోరిక? అనుకున్నరు. కనీ, గిది కూడా ఓ బాధే కాదా? గది తొలిగిపోవాల్నని కోరుకున్నడు గండ్ల తప్పేముంది? గా భక్తుడికి గా బాధలేకుండ సూడు దేవుడా!?

