Wednesday, September 16, 2026
31.2 C
Hyderabad

‘అచ్చ’మైన ఉద్యమకారుడు! స్వచ్ఛమైన పోరాట యోధుడు|ACHHA VIDYASAGAR|BRS

‘మలి’ ఉద్యమానికి ‘తొలి’ ఆయనే!
నాటి గురుతులకు నేటి నెమరు…
DHIKSHA DIWAS|దీక్షాదివస్ సందర్భంగా అచ్చ విద్యాసాగర్ తో ‘అడుగు’ జాడ!|ADUGU

వారి కుటుంబం అప్పటికే వందల ఎకరాలకు భూస్వాములు. కార్ల కంపెనీలకు డీలర్లు. అనేక వ్యాపారాలకు ఆసాములు. తరాలు తిన్నా తరగని ఆస్తిపాస్తులు. ఎంత ఎదిగినా ఒదిగే తత్వం. ఎవ్వరినీ నొప్పించని వ్యక్తిత్వం. ఇవన్నీ వారి సంకల్పం ముందు చిన్న బోయినాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు కర్తవ్య బోధన చేసినాయి. 2001నుంచి ఉద్యమ ప్రస్థానం సాగిన 14ఏళ్ళపాటు వరంగల్ తెలంగాణ ఉద్యమాలన్నింటికీ వారే ఊతం. వారిదే ఇం‘ధనం’. తండ్రి అచ్చ రాఘవులు నేర్పిన జీవిత పాఠాల పాఠశాలలో అన్న అచ్చ వీరేశ్ బాబు, తమ్ముడు అచ్చ విద్యాసాగర్ లు రాటుదేలారు. తెలంగాణ పోరాట ఉద్యమాలకు వెరువని వీరుల్లా నిలిచారు. నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. దీక్షాదివస్ రోజున కూడా కేసీఆర్ డైరెక్షన్ లో అచ్చ విద్యాసాగర్ కేటీఆర్ వెంటే ఉన్నారు. ఆనాటి గురుతులను అచ్చా విద్యాసాగర్ ‘అడుగు’జాడ తో నెమరేసుకున్నారు.

వరంగల్, నవంబర్ 28 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన నాటి నుండి నేను, మా కుటుంబం మొత్తం వారి వెంటే, ఆ ఉద్యమం వెంటే ఇప్పటి దాకా ఉన్నాం. వరంగల్ లో మొదట కేసీఆర్ గారు మా ఇంటికి కూడా వచ్చేవారు. కేసీఆర్ దిశా నిర్దేశంలో చిన్నా చితక మీటింగుల నుంచి వరంగల్ సింహ గర్జన వంటి చారిత్రక భారీ బహిరంగ సభల వరకు ఉద్యమంతోపాటే మా ప్రయాణం, మా పాత్ర కొనసాగుతూనే ఉంది. అలా జయశంకర్ సార్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితక్కలు సహా, ఉద్యమానికి అండగా వచ్చిన నేతలెవరైనా మా ఆతిథ్యం తీసుకోవాల్సిందే. ఇలా సాగిన మా ఉద్యమ ప్రస్థానంలో దిక్షా దివస్ ఓ మరచిపోలేని మధుర ఘటన. జ్ఞాపకం.

2009 నవంబర్ 29కి కొద్ది రోజుల ముందు నుంచే కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షకు సంబంధించిన చర్చలు తెలంగాణ భవన్ లో జరుగుతూనే ఉన్నాయి. వినోద్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్ తదితరులమంతా ఆ చర్చల్లో పాలు పంచుకున్నాం. అప్పట్లో తెలంగాణ ఉద్యమ రూపమేదైనా అందులో అగ్రభాగం వరంగల్ కే ఉండేది. వరంగల్ ఉద్యమానికి ఊపరిగా సాగేది. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా గెలుపులోనూ వరంగల్ పాత్ర అజరామరం. సార్.. అప్పుడు మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు. దీనికి ఒకటి రెండు రోజుల ముందే కేసీఆర్ కరీంనగర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీక్షకు సంబంధించి తర్జనభర్జనలు జరిగాయి. ముందుగా దీక్ష వరంగల్ లోనే చేయాలనుకున్నారు.

తర్వాత హైదరాబాద్, కరీంనగర్ అనుకున్నారు. చివరకు హరీశ్ రావు గారి సూచన మేరకు సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేశారు. అయితే దీక్షను కచ్చితంగా పోలీసులు అడ్డుకుంటారు. అప్పుడు దాన్ని కొనసాగించే దెలా? అన్నదే ప్రధాన సమస్య. దానికి అన్ని జిల్లాలు, ముఖ్యంగా వరంగల్ జిల్లా నేతలను సమాయత్తం చేశారు. కేసీఆర్ వెంట ఎవరుండాలి? వరంగల్ లో ఎవరెవరుండాలి? దీక్షను పోలీసులు అడ్డుకున్న తర్వాత కూడా ఎలా కొనసాగించాలన్న ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మమ్మల్ని వరంగల్ లోనే ఉండాలని, ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ గారు ఆదేశించారు.

‘తెలంగాణ వచ్చుడో…కేసిఆర్ సచ్చడో’ అన్న నినాదంతో 2009, నవంబర్ 29వ తేదీన ఆమరణ దీక్షకు దిగారు. కరీంనగర్ లోని తన కార్యాలయం నుంచి సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలానికి బయలు దేరిన కేసీఆర్ ను కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ ను తన వాహనం నుంచి బలవంతంగా దించివేయడంతో, రోడ్డుమీదే ధర్నా ప్రారంభించారు. దీంతో కేసీఆర్ ను వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించారు. వరంగల్ మీదుగా కావడంతో వరంగల్ నగరం దాటే వరకు కేసీఆర్ ని తీసుకెళ్ళిన వాహనాల వెంబడి పడి ప్రయాణించాం. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాం. అడగడుగునా పోలీసుల వాహనాలను అడ్డుకున్నాం. ఖమ్మం దాకా ఇదే పరిస్థితి.

పోలీసులు ముందుగా కేసీఆర్ ను కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు తీసుకెళ్ళాలనుకున్నారు. కానీ సెంట్రల్ జైలు వరంగల్ నగరం నడిబొడ్డున ఉంది. వరంగల్ కు మార్చారు. వరంగల్ ఉద్యమాల గడ్డ. అడ్డా కావడంతో ఇక్కడ ఉద్యమకారులను అదుపుచేయడం సాధ్యం కాదని, తర్వాత కేసీఆర్ ను ఖమ్మం జైలుకు తీసుకెళ్ళారు. అప్పుడు ఖమ్మంలో ఉద్యమ తీవ్రత తక్కువగా ఉండేది. కానీ, ఖమ్మం కు కూడా వరంగల్ నుంచి ఉద్యమకారులు వెళ్ళారు.

అయితే, ఆ సమయంలో కేటీఆర్ ను అరెస్టు చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కేటీఆర్ ఉప్పుడప్పుడే ఉద్యమంలో బలం పుంజుకుంటున్నారు. కేటీఆర్ వెంటే ఉండే డ్యూటీ మాకప్పగించారు. మేమంతా టీమ్ గా కేటీఆర్ వెంటే ఉన్నాం. కేసీఆర్ వెంట నాయిని నర్సింహారెడ్డి, కన్నెబోయిన రాజయ్యయాదవ్, వినోద్ గారు తదితరులు వెళ్ళారు. వరంగల్ కేటీఆర్ విడుదలైనప్పుడు కూడా మేమంతా ఆయనకు ఘనంగా స్వాగతం పలికాం.

అదే రోజు శ్రీకాంతాచారి ఆత్మాహుతి ఘటన ఉద్యమాన్ని రగులుకొల్పింది. ఖమ్మం జైలులో కేసీఆర్ దీక్షలో ఉండగానే ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. కేటీఆర్ విడుదల తర్వాత ఒకవైపు వరంగల్ లో ఉద్యమాన్ని నడుపుతూనే, మరోవైపు నిమ్స్ కు వెళ్ళి వచ్చేవాళ్ళం. కేసీఆర్ ఆరోగ్యాన్ని వాకబు చేస్తూనే, రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే వరంగల్ లో జరిగే ఉద్యమాలే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు దిశానిర్దేశంగా ఉండేవి.

డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్రం ప్రకటించిన తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష విరమించిన వరకు11 రోజుల పాటు ఉద్యమాన్ని వరంగల్ లో ఉద్ధృతంగా నిర్వహించాం. సబ్బండ కులాలు, వర్గాలు ఆ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఇప్పటికీ తెలంగాణ నిబద్ధతతోనే ఉన్నాం. అయితే ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలే మాకు మిగిలాయి. ఫలితాలు అందరికీ అందాయి.

ఉద్యమం కోసం మా వ్యాపారాలను నిర్లక్ష్యం చేసి, చాలా వరకు వదులుకున్నాం. ఎంతో ఖర్చు చేశాం. విలువైన మా భవిష్యత్తును ఉద్యమానికి త్యాగం చేశాం. ఎందుకనో కానీ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్ళ పాలనలో మాకు తగిన గుర్తింపు రాలేదు. ఏ అవకాశమూ ఇవ్వలేదు. అయినా మేం బీఆర్ఎస్ పార్టీని వీడలేదు. ఎవరినీ నిందించడం లేదు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న సంతోషం మిగిలింది. చాలు.’

-అచ్చ విద్యాసాగర్, తెలంగాణ ఉద్యమకారుడు

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News