Sunday, September 13, 2026
26.2 C
Hyderabad

తెలంగాణ అభివృద్ధి కోసం విస్తృత ప్రణాళికలు

భారత్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

భారత్ సమ్మిట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…., ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని తెలిపారు. తెలంగాణకు ఉన్న గొప్ప చరిత్ర, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ఆయన పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించేందుకు విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళలు కలిసిపడి ఏకగొంతుగా పోరాడిన నేపథ్యంలో, వారి త్యాగ ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, వాటి సాధన కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని ఆయన చెప్పారు.

సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, అణగారిన కులాల ఆకాంక్షలు నెరవేర్చడమే తన ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం ప్రారంభించిందని, 2024 ఆగస్టు 15న రూ.20,617 కోట్లు చెల్లించి 25.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తమదని అన్నారు. ఇదే దేశంలో అతిపెద్ద రుణమాఫీగా గుర్తింపు పొందిందని తెలిపారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా, ‘రైతు భరోసా’ పథకం ద్వారా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. భూమిలేని రైతుకూలీలకూ ఏడాదికి రూ.12,000 సాయం అందిస్తున్నామన్నారు. రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా అందిస్తున్నామని చెప్పారు. రైతుబీమా, పంటల బీమా వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వివరించారు.

యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ’ని స్థాపించామని, అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 60 వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయగలిగామని రేవంత్ రెడ్డి గారు తెలిపారు. 5 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు.

జవహర్‌లాల్ నెహ్రూ నీటిపారుదల, విద్యపై దృష్టి పెట్టగా, ఇందిరా గాంధీ ‘రోటీ, కపడా, మకాన్’ నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నేతలు టెలికాం, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వివరించారు. వారి కృషితోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు.

దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ లాంటి దేశాల్లో పెట్టుబడుల సదస్సులకు హాజరై, రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో యువతకు ప్రైవేటు రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.

మహిళా సాధికారత కోసం విస్తృతమైన చర్యలు తీసుకున్నట్లు సీఎం వివరించారు. 67 లక్షల మంది స్వయం సహాయక బృంద సభ్యులు రాష్ట్రంలో ఉన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్నదే లక్ష్యమని చెప్పారు. సౌర విద్యుత్ సంస్థలు, పెట్రోల్ బంకుల యాజమాన్యం, ఆర్టీసీ బస్సుల నడిపింపు వంటి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించామన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల కుటుంబాలకు ఇళ్లు నిర్మించేందుకు రూ.22,000 కోట్లు మంజూరు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని వివరించారు. ఈ ఉచిత బస్సు ప్రయోజనానికి ఇప్పటివరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటివరకు రూ.1,000 కోట్లు అందించామని వివరించారు.

హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్లు సీఎం తెలిపారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేసి నగరానికి పెద్ద ఆకర్షణగా మార్చేందుకు పనులు చేపట్టామని వివరించారు. ప్రపంచ ప్రాముఖ్యత గల హడ్సన్, థేమ్స్, సుమిదా నదీ పునరుద్ధరణలను అధ్యయనం చేశామని చెప్పారు.

హైదరాబాద్ చుట్టూ 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి చేస్తున్నామని, 370 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. మెట్రో రైలు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, పేదలకు సంక్షేమం అందించడం తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

భారతదేశంలో మొదటిసారిగా కులసర్వే నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గర్వంతో తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంలో థర్డ్ జెండర్ రిక్రూట్మెంట్ చేసిన తొలి ప్రభుత్వం కూడా త
తెలంగాణెనని గుర్తుచేశారు.

“మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది,” అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల జీవితాలను మార్చే మిషన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వారి అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను మాతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. “మీరే తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి,” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

Latest News

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News