Monday, August 3, 2026
31.5 C
Hyderabad

పరిశ్రమలు సరే, మరి పర్యావరణం సంగతేంటి?|EDITORIAL

ప్రభుత్వాలకు పరిశ్రమల పరివ్యాప్తిపై ఉన్న యావ, పర్యావరణంపై ఉండటం లేదు. పెట్టుబడుల కోసం పట్టువిడుపులు లేకుండా ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. కనబడ్డ ప్రతి కంపెనీని నిస్సిగ్గుగా బిచ్చమెత్తుకుంటున్నారు. పెట్టుబడులు పెడితే, మీక్కావల్సిన వన్నీ ఇచ్చేస్తా మంటున్నారు. ఇందుకు పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలు అనుసరిస్తున్నారు. మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ప్రభుత్వాలకు పరిశ్రమల పరివ్యాప్తిపై ఉన్న యావ, పర్యావరణంపై ఉండటం లేదు. పెట్టుబడుల కోసం పట్టువిడుపులు లేకుండా ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. కనబడ్డ ప్రతి కంపెనీని బిచ్చమెత్తుకుంటున్నారు. పెట్టుబడులు పెట్టండి. మీక్కావల్సినవన్నీ ఇచ్చేస్తామంటున్నారు. ఇందుకు పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలు అనుసరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు కీలక పారిశ్రామిక విధానాలను అమలులోకి తెచ్చింది. ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఎంఎస్ఎంఇ ఎంట్రప్రిన్యూరీ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 విధానాలకు మార్గదర్శకాలను వెలువరించింది. అదేవిధంగా, రాష్ట్రంలో 45వేల ఎకరాల పారిశ్రమల కోసం సిద్ధంగా ఉంచింది. ఈ విధానాల ద్వారా ఉద్యోగాల కల్పన, పెట్టుబడి ఆకర్షణ వంటివి వీటి లక్ష్యాలు.

తెలంగాణలో కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ల కొరకు రూ. 45 వేల కోట్లు పెట్టుబడి అంచనాతో ఉంది. ఇందుకవసరమైన భూ సేకరణకు కూడా చేపడుతున్నది. ఇప్పటికే తెలంగాణలోని 2,180 పరిశ్రమలలో 2,179కి ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమల వ్యర్థాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
పరిశ్రమల చుట్టుముట్టు ప్రాంతాల్లో పీల్చే గాలి, తాగే నీరు ప్రమాదకరంగా మారాయి. ప్రాణాంతక వ్యాధులకు అవి కేంద్రంగా వున్నాయి. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను అటు ప్రభుత్వమూ, ఇటు పరిశ్రమాధిపతులు పూర్తిగా వదిలేశారు. కోట్ల విలువైన రాయితీలు, సదుపాయాలు కల్పించి పరిశ్రమాధిపతులకు లాభాలు సమకూర్చడం పైనే ప్రభుత్వాలు శ్రద్ధ చూపుతున్నాయి. ఆ పరిశ్రమలకు భూములిచ్చిన రైతులు, ఉపాధి కోల్పోయిన పేదలు, వృత్తిదారులను విస్మరించాయి. ఇప్పటికే ఉప్పాడ కార్మికులు సముద్రంలో కలుస్తున్న కాలుష్యాన్ని నిలిపివేయాలంటూ పాలకులను నిలదీసారు. తాజాగా అనకాపల్లి సెజ్‌ ఏర్పాటుపై మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వారు అంటున్నారు. అనకాపల్లి జిల్లాలోని సక్కపల్లి మండలంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్ ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకి చేరుకుంది.

నిజానికి ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి అంతేగానీ తీయకూడదు. రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల్లో వేలాది మందికి ఉపాధి కలగనుందని ప్రభుత్వం చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. పైగా ఆ పరిశ్రమల ఏర్పాటు కోసం జరిగే ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలన్న డిమాండ్‌పై ఏకమవడం నూతన పరిణామం.

ఉపాధి పేరుతో మోసగించి కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చాలన్న ప్రభుత్వ పెద్దల ఆరాటానికి ప్రజా పోరాటాలు బ్రేకులు వేస్తున్నాయి. పోలీసు బలగాలతో ప్రజలను భయపెట్టేందుకు యత్నించినా చాలా ప్రాంతాల్లో తిరగబడుతున్నారు. బల్క్‌ డ్రగ్‌ ఒక్కటే కాదు ఎక్కడ భూ సేకరణ జరిగినా రైతులు తిరగబడుతున్నారు. పరిశ్రమలకు ఒకనాడు భూములిచ్చిన రైతులు ఇపుడు అడుక్కు తింటున్నారు. తెలంగాణ, ఆంధ్రా అన్న తేడా లేకుండా పరిశ్రములు, రోడ్లు, ప్రాజెక్టులకు రైతుల భూములు లాక్కోవడం వారిని వదిలివేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. పోలవం బాధితులు, మల్లన్నసాగర్‌ బాధితులు ఇదే కోవలోకి వస్తారు.

కొద్ది రోజుల క్రితం బల్క్ డ్రగ్ ప్రాజెక్టును ఆపాలంటూ, ఆ ప్రాంత పర్యటనకు వెళ్లిన మంత్రి వాహనం ముందు తాటిచెట్టు అడ్డంపెట్టి మరీ పోరాడారు. దీంతో తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నట్టు మంత్రి ప్రకటించాల్సి వచ్చింది. ఆదానీకి చెందిన గంగవరం పోర్టు ధూళి, దుమ్ముతో భరించలేని కాలుష్యంతో బాధపడుతున్న ప్రజల్లో అంబూజా సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుపై ఆగ్రహం వెల్లువెత్తింది. విశాఖ పోర్టు ట్రస్ట్‌, గంగవరం పోర్టును పర్యావరణ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదు. ఎన్టీపిసి కాలుష్యంతో మూల స్వయంవరం, సోమినాయుడుపాలెం ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. పరవాడ ఫార్మా సిటీకి అనుకొనివున్న గ్రామాలు వాయు కాలుష్యంతో తల్లడిల్లుతున్నాయి. పరిశ్రమలు వ్యర్థ రసాయన జలాలను శుద్ధి చేయకుండా చెరువుల్లోకి విడిచిపెడుతున్నాయి. రాంకీ యాజమాన్యానికి కాలుష్య నియంత్రణ అధికారులు నోటీసులు జారీ చేసినా? చర్యలేవిూ తీసుకోలేదు. ముత్యాలమ్మపాలెం ఉప్పుటేరు కాలుష్యమయమైంది. అచ్యుతాపురం సెజ్‌ లోని వ్యర్థాలను శుద్ధి చేయకుండా పూడిమడక వాగులోకి వదిలేయడంతో చేపలు చనిపోయి మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రజలకు హానికరంగా నిబంధనలు సవరించి కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉంటున్నారు.

ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తినకుండా వుండాలంటే పర్యావరణ ప్రమాణాలను పరిశ్రమలు పాటించేలా నిబంధనలు కఠినతరం చేయాలి. అలాగే కాలుష్యకారక పరిశ్రమలతో పర్యావరణాన్ని దెబ్బతీసే పరిశ్రమలను దూరం పెట్టడమే మంచిది.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News