High Court| హైకోర్టు ఆదేశం |Orders
Telangana| తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. State government| రాష్ట్ర ప్రభుత్వం, state election commission| రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు నెలల లోపున పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టంగా తెలిపింది. ఈ మేరకు జస్టిస్ టి. మాధవీ దేవి తీర్పు ఇచ్చారు. ఇప్పటికే పంచాయతీల పదవీకాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది. ప్రజాప్రతినిధి వ్యవస్థను నిలిపేసే విధంగా ఆలస్యం చేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తీర్పుతో పంచాయతీ రాజ్ శాఖతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది.

