Wednesday, September 23, 2026
26 C
Hyderabad

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల పక్షాన నిలిచే ‘ప్రెషర్ గ్రూపు’లు బలపడినప్పుడే అధికార అహంకారానికి అడ్డుకట్ట పడుతుంది. అదే అసలై ప్రజాస్వామ్యానికి నిజమైన మార్గం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలకే పరిమితం కాదు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే పరిపాలన, అధికారాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే వ్యవస్థల సమాహారమే నిజమైన ప్రజాస్వామ్యం. పాలకులు ప్రజల అభిప్రాయాలను, ప్రతిపక్షాల సూచనలను, సామాజిక వర్గాల ఆందోళనలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో పరిపాలన సాగిస్తే, ప్రజాస్వామ్యానికి దుష్ట చీడ పట్టినట్లే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేసే బలమైన ‘ప్రెషర్ గ్రూపులు’ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలుగా నిలుస్తాయి.

ఇటీవల దేశవ్యాప్తంగా పరీక్షా పేపర్ల లీకేజీలపై విద్యార్థులు చేపట్టిన ఉద్యమం దీనికి తాజా ఉదాహరణ. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారడంతో యువత దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఈ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం స్పందించి, దిగిరాక తప్పలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, పరీక్షల వ్యవస్థను సాంకేతికంగా మరింత పారదర్శకంగా మార్చేందుకు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు ప్రజా ఒత్తిడి ఫలితంగానే వెలువడ్డాయి.

ఈ ఉద్యమంలో కీలకంగా నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చేసిన ప్రకటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల్లో పోటీ చేయడం తమ లక్ష్యం కాదని, ప్రజల తరపున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే ‘ప్రెషర్ గ్రూప్‌’గా కొనసాగుతామని దీప్కే ప్రకటించడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన సంకేతం. అయితే ఈ ఉద్యమం రాజకీయ ప్రయోజనాలకు వేదిక కాకుండా స్వతంత్ర ప్రజా ఉద్యమంగా కొనసాగినప్పుడే దాని విశ్వసనీయత నిలుస్తుంది.

‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల భారం, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రజలతో నేరుగా మమేకమవుతామని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చైతన్య కార్యక్రమాలు ప్రభుత్వానికి అద్దం పట్టే సాధనాలుగా ఉపయోగపడతాయి.

నిరుద్యోగం నేడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. అధికారిక గణాంకాల ప్రకారం 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగ రేటు 2017-18లో 17.8 శాతం ఉండగా, 2023-24లో 10.2 శాతానికి తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ విద్యావంతులైన యువతలో ఉద్యోగాల కొరత కొనసాగుతుండటం ఆందోళనకరమే. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2025లో సెకండరీ విద్య లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న వారి నిరుద్యోగ రేటు 6.5 శాతంగా నమోదైంది.

అయితే గణాంకాలు ఇలావుంటే, వాస్తవ పరిస్థితి వేరే కథ చెబుతోంది. ఇటీవల వెలువడిన విశ్లేషణల ప్రకారం యువతలో ఉద్యోగ అవకాశాల కొరత, నాణ్యమైన ఉపాధి లభించకపోవడం, పరీక్షల వ్యవస్థపై విశ్వాసం దెబ్బతినడం వంటి అంశాలే దేశవ్యాప్త నిరసనలకు ప్రధాన కారణాలుగా మారాయి.
విద్య కూడా నేడు మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. ఒకటో తరగతి నుంచే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు పెరుగుతున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను వ్యాపార అవకాశంగా మార్చుకోవడం విచారకరం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విద్యను ప్రాథమిక హక్కుగా భావించారు. కానీ నేడు అది హక్కు కంటే వ్యాపార వస్తువుగా మారడం సమాజానికి మేలు చేసే పరిణామం కాదు. ఈ అంశంపై ఉద్యమం చేయాలన్న సీజేపీ సంకల్పం స్వాగతించదగినదే.

ఇదిలా ఉండగా, విద్యార్థుల ఉద్యమానికి వివిధ వర్గాల నుంచి లభిస్తున్న మద్దతు కూడా గమనించదగ్గది. యువత ప్రశ్నించడం, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య హక్కులేనని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించడం ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యంలో చర్చకు ప్రత్యామ్నాయం లేదని ఆయన చేసిన వ్యాఖ్య ప్రతి పాలకుడు గుర్తుంచుకోవాల్సిన అంశమే.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం, విద్యా సంస్థలు, నియామక వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ వంటి సంస్థలపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసం దెబ్బతింటే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు విమర్శలను శత్రుత్వంగా కాకుండా సవరణకు అవకాశంగా స్వీకరించాలి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే సంస్కృతి పెంపొందించాలి. ప్రజలే యజమానులు, ప్రభుత్వాలు సేవకులనే రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో చూపాలి.

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల పక్షాన నిలిచే ‘ప్రెషర్ గ్రూపు’లు బలపడినప్పుడే అధికార అహంకారానికి అడ్డుకట్ట పడుతుంది. అదే ప్రజాస్వామ్యానికి పట్టిన చీడను వదిలించే నిజమైన మార్గం.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News