Tuesday, September 15, 2026
25.7 C
Hyderabad

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది..
రేపు మీకూ జరుగుతుంది
ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి
రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తన వివరణ తీసుకోకుండా, తనకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బర్తరఫ్‌ చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. “నా బర్తరఫ్‌ చెల్లదు. నా వివరణ తీసుకోకుండా నన్ను ఎలా బర్తరఫ్‌ చేస్తారు?” అని ఆమె నిలదీశారు. తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని స్పష్టం చేశారు. సుస్మిత వ్యక్తిగత అభిప్రాయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె అభిప్రాయాలను తప్పుపట్టే అధికారం తమకు లేదని అన్నారు. తన కూతురు ఏదో ఒక మాట అన్నందుకు తనను టార్గెట్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై కూడా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు.. మీకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ఈరోజు తనకు జరిగిన పరిణామం రేపు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఎదురుకావచ్చని హెచ్చరించారు. ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రజలకు ఇస్తామన్న హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే నిర్వహించాలని సూచించారు.

తన కూతురు సుస్మితకు పార్టీ టికెట్‌ కోరడంలో తప్పేముందని సురేఖ ప్రశ్నించారు. పదేళ్లుగా తన కూతురు టికెట్‌ కోసం ప్రయత్నిస్తోందని తెలిపారు. అరవింద్‌ బీజేపీలో ఉంటే.. సంజయ్‌ కాంగ్రెస్‌లో లేరా? అని ప్రశ్నించారు. కడియం తన కూతురిని రాజకీయంగా ఎంపిక చేసుకోలేదా? అని ప్రస్తావిస్తూ, సుస్మిత టికెట్‌ అడిగితే తప్పేంటని నిలదీశారు. తనను రాజీనామా చేయాలని ఎవరూ అడగలేదని, తనకు సమాచారం ఇవ్వకుండానే బర్తరఫ్‌ చేశారని ఆరోపించారు. తన కూతురు వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తాను ఎందుకు ఖండన ఇవ్వాలని ప్రశ్నించారు. 100 మంది నన్ను విమర్శిస్తున్నారు.. వారి కుటుంబ సభ్యులను బాధ్యులను చేస్తున్నారా? అని నిలదీశారు.

మరోవైపు సుమంత్‌ అరెస్టు కక్షపూరిత చర్యేనని కొండా సురేఖ ఆరోపించారు. టీడీపీ నేపథ్యం ఉన్నవారు ఇలాంటి చర్యలకు పాల్పడతారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తనను కావాలనే మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడం సంతోషంగా ఉందని చెప్పారు. తనకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని స్పష్టం చేశారు.

రెండున్నరేళ్లపాటు మంత్రిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించానని కొండా సురేఖ తెలిపారు. తన పేషీకి వచ్చిన ప్రతి పనిని న్యాయబద్ధంగా పూర్తి చేశానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. తనను బర్తరఫ్‌ చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలు ఇచ్చారు. తనపై విమర్శలు చేసినవారిని ఉద్దేశించి నన్ను అన్నవాళ్లకు ఉరుసు తగులుతుంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో మరింత రాజకీయ వేడిని పెంచాయి. మంత్రి పదవి నుంచి తొలగింపు వ్యవహారం నేపథ్యంలో ఆమె తదుపరి రాజకీయ అడుగు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News