‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి.

గీమె పేరు ఆశ. గీమె ఊరు ఉత్తర్ ప్రదేశ్ లోని మోదీనగర్. గీమెకు సచిన్ అనే ఆయనతోని పెండ్లైంది. ఇద్దరు పిల్లలు. 12 ఏండ్ల కింద ఓ పమాదం జరిగింది. గండ్ల గామె పెనిమిటికి వెన్నుపూస దెబ్బతింది. నడవకుంట అయిండు. ఇగానుంచి గామే గా కుటుంబాన్ని మోత్తాంది. కనీ, గాయినకు హరిద్వార్ ల ఉన్న శివుని గుడిని సూడాలనిపించిందట. గా ముచ్చటనే గామెకు శెప్పిండు. గంతే, గామె తన పెనిమిటిని వీపునేసుకుని, మోసుకుంట 180 కిలోమీటర్లు పయాణించి సక్కగ గా గుడికి తీస్కపోయింది. అంతా గిదీన్ని సూసి గిదేం ఇచ్చెంత్రం అని ఆశీర పోతాండ్రు. గిప్పుడే కాదుల్లా… పోయినేడాది గిట్లనే గాయినను హరిద్వార్ ల జరిగే కన్వర్ యాత్రకు కూడ తీస్కపోయిందట! భర్త కాదుల్లా…భర్త ఏం చేసినా భరించేది, కుటుంబ భారాన్ని మోసేది భార్యే పో!?.

