Thursday, September 24, 2026
22.2 C
Hyderabad

జనవరి 10 – 2025 శుక్రవారం

శ్రీ క్రోధినామ సంవత్సరం–దక్షిణాయనం
హేమంతఋతువు- పుష్యమాసం-శుక్లపక్షం
ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం
తిధి శు.ఏకాదశి ఉదయం 09.58 వరకు
ఉపరి ద్వాదశి
నక్షత్రం కృత్తిక పగలు 11.50 వరకు ఉపరి
రోహిణి
యోగం శుభ పగలు 02.59 వరకు ఉపరి
శుక్ల
కరణం భద్ర ఉదయం 09.53 వరకు ఉపరి
బాలవ
వర్జ్యం రాత్రి తెల్ల 03.31 నుండి 05.02 వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి పగలు 12.24 నుండి
01.12 వరకు
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.49
సూర్యాస్తమయం సాయంత్రం 05.59

జనవరి 10 –2025 శుక్రవారం
నేటి రాశి ఫలితాలు

మేషం
దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకోడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

వృషభం
వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మిధునం
ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం
అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరు ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్యాలను కొంత బాధిస్తాయి.

సింహం
మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన వివాహ విషయమై గృహమున ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయ

కన్య
మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

తుల
ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంత బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.

వృశ్చికం
వృత్తి వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్త్రా భరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.

ధనస్సు
ఇంటా బయట విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విషయాలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తవుతాయి.

మకరం
బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కుంభం
ఆర్థిక పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యను ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు.

మీనం
సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణబాధలు నుండి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధన లాభ సూచనలు ఉన్నవి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News