Monday, June 29, 2026
26.6 C
Hyderabad

జనగామ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓగా ట్రైనీ ఐపీఎస్

జనగామ జిల్లా పోలీసు శాఖలో సేవలందించేందుకు ట్రైనీ ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంక్ సాధించిన మనన్ భట్, జనగామలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాత్రి ఆయన చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జనగామ ఏసీపీ పార్థసారథి, సీఐ దామోదరరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

జమ్మూ కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌కు చెందిన మనన్ భట్ ఐఐటీ శ్రీనగర్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ పూర్తిచేశారు. ఆ తర్వాత సివిల్స్ పరీక్షకు సన్నద్ధమై 2023లో ప్రతిష్టాత్మక ఐపీఎస్ ర్యాంక్ సాధించారు. 2021లో ఆయన అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సాధించినప్పటికీ, ఐఏఎస్ మరియు ఐపీఎస్ వంటి అత్యున్నత పదవుల కోసం ప్రయత్నించి విజయం సాధించారు. ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్ అధికారిగా జనగామలో కొద్ది రోజులు సేవలందించనున్నారు. 88వ ర్యాంక్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భట్, తన పట్టుదలతో ప్రజలకు సర్వీస్ అందించేందుకు సిద్దపడ్డారు.

Latest News

పురుగుల శాక్లేట్లు!?|ADUGU TRENDS

శాకిలేట్లంటే ఎవ్వలికైనా ఇట్టమే.! శిన్న పిల్లలైతే నాక్కుంట, శీక్కుంట మరీ ఇట్టంగ తింటరు. గా శాకిలేట్ శేతికిత్తిమా శెప్పినట్టింటరు. అన్నం తింటరు. ఏడుపాపుతరు. శెప్పింది చేత్తరు. గందుకే పిల్లలకు బాజర్ల శాకిలేట్లు కొనిపిచ్చుడు...

యుద్ధం ముగిసిందా? ఎగసిందా!?|EDITORIAL

యుద్ధం ఎప్పుడూ విజేతలను కాకుండా, మరింత విధ్వంసాన్ని మాత్రమే మిగులుస్తుందనే చారిత్రక సత్యం. పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం కేవలం ఆ ప్రాంత దేశాలకే కాదు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కూడా అత్యంత అవసరం....

జూన్ 30, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి పాడ్యమి పూర్తిగా రోజంత నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా రోజంత యోగం బ్రహ్మ మధ్యాహ్నం 03.33 వరకు ఉపరి ఐంద్ర కరణం బాలవ సాయంత్రం 05.07 వరకు ఉపరి కౌలవ రాహుకాలం పగలు 03.00 నుండి 04.30...

జూన్ 29, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి తెల్ల 04.12 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం మూల రాత్రి తెల్ల 03.31 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం శుక్ల మధ్యాహ్నం 02.53 వరకు ఉపరి బ్రహ్మ కరణం భద్ర మధ్యాహ్నం...

దంటగాడు!?|ADUGU TRENDS

రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకంటే గూడా దంటగాల్లే ఎక్కువ అంటరు. ఎవలికీ శెప్పుకోలేనివి గా దంటగాల్లకు శెప్పుకుంటరు. గవాల్లు గూడా బాగా సూసుకుంటరు. నీ గురించి అన్నీ తెలిసి కూడా నిన్ను ప్రేమించేవాడు,...

ప్రశ్నార్థకంగా ప్రశ్నించే సంస్కృతి!?|EDITORIAL

అధికారాన్ని నియంత్రించేది చట్టం. చట్టాన్ని సజీవంగా ఉంచేది ప్రజల అప్రమత్తత. ఈ రెండింటి మధ్య వంతెనగా నిలిచేది ప్రశ్నించే సంస్కృతి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అన్యాయం జరగడం కాదు. అన్యాయం జరిగినా సమాజం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 28 నుండి జూలై 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే...

ఆఖరి మజిలీ అదే!?|ADUGU TRENDS

స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ది టర్నినల్’ సినిమా చూసిండ్రా? గా సినిమాకు అసల్ కథ గీయినదే! మనిసి మనుగడ, జీవిత మజిలీలకు గీయినె జీవితమే ఉదాహరణ. గందుకే గా స్పీల్ బర్గ్...

వెనెజువెలా ప్రపంచానికి హెచ్చరిక!?|EDITORIAL

వెనెజువెలా విషాదం ప్రపంచానికి మరో కీలక సందేశాన్ని అందిస్తోంది. ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, శాస్త్రీయ ప్రణాళిక, భూకంప నిరోధక నిర్మాణాలు, విపత్తు నిర్వహణలో సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన, అంతర్జాతీయ సహకారంతో ప్రాణనష్టాన్ని...

జూన్ 27, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 12.14 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అనురాధ రాత్రి 10.29 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సాధ్య మధ్యాహ్నం 01.38 వరకు ఉపరి శుభ కరణం కౌలవ ఉదయం 11.20...

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News