Monday, July 13, 2026
29.3 C
Hyderabad

పర్యావరణ ప్రతీకలు పులులు!|EDITORIAL

పులుల జన సంచారం ఒక హెచ్చరిక. ఇది ప్రకృతి మనకు ఇస్తున్న చివరి సంకేతం. ఇప్పటికైనా మేల్కొని అడవులను కాపాడితేనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. లేదంటే అభివృద్ధి పేరుతో మనమే మన భవిష్యత్తును నాశనం చేసుకున్న వారమవుతాం. అడవులను రక్షించడం అంటే కేవలం పులులను మాత్రమే కాదు, మనల్ని మనం రక్షించుకోవడమే.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పర్యావరణ సమతౌల్యానికి పులులు ప్రతీకలు! జీవ వైవిధ్యానికే జీవం పులులు!! అడవుల్లో పులి ఉందంటే, అక్కడ జీవవైవిధ్యం సరిగ్గా ఉందని అర్థం. అందుకే 1973కు ముందు జాతీయ జంతువుగా ఉన్న సింహాన్ని కాదని పులిని ప్రకటించారు. ఇది దయ, బలం, చురుకుదనం, శక్తికి ప్రతీక. వన్యప్రాణి సంరక్షణకు చిహ్నం. అటువంటి కీలకమైన వన్యప్రాణి నేడు అడవులను విడిచి గ్రామాలు, పట్టణాల అంచులలో సంచరిడానికి కారణం మానవులే. మనమే. అడవులను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం, కొండలను విధ్వంసం చేయడం, సహజ వనరులను లూటీ చేయడమే ఈ సంక్షోభానికి మూలం.
అడవులు జంతుజాలానికి ఆవాసాలు. ఆవాసాలే నశించి, వాటి మనుగడ ప్రమాదంలో పడుతుంటే, అవి ఎక్కడికెళ్ళాలి? అడవులు పచ్చగా ఉన్నంతకాలం పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు అడవుల్లోనే ప్రశాంతంగా జీవించాయి. కానీ, అభివృద్ధి పేరుతో సాగుతున్న అడవుల విధ్వంసం వన్యప్రాణులను బలవంతంగా మనుషుల మధ్యకు నెట్టేస్తోంది. దీంతో పులులు గ్రామాల్లోకి రావడం, ప్రజల్లో భయాందోళనలు చెలరేగడం సహజంగా మారింది.

ఏపీ, తెలంగాణాల్లో ఇటీవల పులుల సంచారం పెరగడం ఇదే చేదు నిజానికి నిదర్శనం. నల్లమల, తిరుమల కొండలు, అమ్రాబాద్‌, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి వంటి అటవీ ప్రాంతాల్లో పులుల కదలికలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని తాడోబా టైగర్‌ రిజర్వ్ లో పులుల సంఖ్య పెరగడంతో అక్కడ స్థలం సరిపోక, కొత్త ఆవాసాల కోసం అవి తెలంగాణ వైపు కదులుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులను ఈదుకుంటూ పులులు ప్రయాణిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చేసుకోవచ్చు.
అడవుల విస్తీర్ణం తగ్గడం, అటవీ కారిడార్లు ఛిన్నాభిన్నం కావడం వల్ల పులులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సురక్షితంగా కదలలేకపోతున్నాయి. దీంతో అవి వ్యవసాయ పొలాలు, గ్రామాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇది మనుషులకు మాత్రమే కాదు, పులులకు కూడా ప్రమాదకరం. ఒకవైపు పంట నష్టం, ఆస్తి విధ్వంసం జరుగుతుండగా, మరోవైపు వేటగాళ్ల ఉచ్చులు, రోడ్డు ప్రమాదాల్లో పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రకాశం జిల్లాలో వాహనం ఢీకొని ఓ పులి మృతి చెందడం మన నిర్లక్ష్యానికి నిదర్శణం.

ఇప్పటికే గ్రామాల్లో కోతులు విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. పులులు, చిరుతలు కూడా అదే బాటలో వస్తే పరిస్థితి ఎంత భయానకంగా మారుతుందో ఊహించుకోవడం కష్టం కాదు. సమస్యను మూలంలోనే పరిష్కరించకుండా, వన్యప్రాణులను తరిమికొట్టే చర్యలతో సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. అడవులను కాపాడకపోతే, రేపు మనుషులే తమతోపాటు తమ నివాసాలను వాటి బారి నుండి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు, ట్రాకర్లు, ప్రత్యేక గస్తీ బృందాలతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. కానీ వాటిని నియంత్రించలేరు. ఈ సమస్యకు అసలైన పరిష్కారం అడవుల సంరక్షణలోనే ఉంది. అటవీ కారిడార్లను పునరుద్ధరించడం, అక్రమ నరికివేతను అరికట్టడం, కొండలను సంరక్షించడం అత్యవసరం. అభివృద్ధి ప్రణాళికలలో పర్యావరణ ప్రభావ అంచనాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

ఇంకా పులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. పులిని శత్రువుగా కాకుండా పర్యావరణ రక్షకుడిగా చూడగల దృష్టి రావాలి. సమాచారాన్ని వెంటనే అటవీశాఖకు అందించడం, వేటగాళ్లను నిరోధించడం ప్రజల బాధ్యత. ఎందుకంటే అడవులు ఉంటేనే మనం ఉంటాం. పులులు ఉంటేనే అడవులు ఉంటాయి.

పులుల జన సంచారం ఒక హెచ్చరిక. ఇది ప్రకృతి మనకు ఇస్తున్న చివరి సంకేతం. ఇప్పటికైనా మేల్కొని అడవులను కాపాడితేనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. లేదంటే అభివృద్ధి పేరుతో మనమే మన భవిష్యత్తును నాశనం చేసుకున్న వారమవుతాం. అడవులను రక్షించడం అంటే కేవలం పులులను మాత్రమే కాదు, మనల్ని మనం రక్షించుకోవడమే.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News