జాతీయ పరీక్షా ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2025 మొదటి సెషన్ ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. జనవరి 22 నుండి 29 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 1 నుండి 8 వరకు జరుగనున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత పొందాలంటే అభ్యర్థులు మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. విద్యార్థులు తమ స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అడుగులు ప్రణాళికా బద్ధంగా వేయాలని అధికారులు సూచిస్తున్నారు.

