కేంద్ర ప్రభుత్వం ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించింది. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్, ఒలింపిక్స్ షూటింగ్ విజేత మనుబాకర్, హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్‌సింగ్, పారా అథ్లెటిక్ ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన ప్రవీణ్‌కుమార్‌లకు ఖేల్‌రత్న అవార్డు అందించారు. 32 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు, 17 మంది పారా అథ్లెటిక్ క్రీడాకారులకు అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డులను ఈనెల 17న రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.

