కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.మేయర్ తో కలిసి 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.భూకబ్జాలు,నేర చరిత ఉన్నోళ్లు,ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న బీఆర్ఎస్ నాయకులను బీజేపీలో చేర్చుకోబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు.ప్రజల్లో పలుకుబడి ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను మాత్రమే బీజేపీలోకి తేవాలన్నారు.

