Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

ఎన్డీఎ పక్షాలకు పరిపాలనలో భాగస్వామ్యమేది!?|EDITORIAL

పేరుకే జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్‌డిఎ). పరిపాలన మొత్తం ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీదే. ఇంకా చెప్పాలంటే మోడీదే. వరుసగా మూడోసారి మోడీ ప్రధాని కావడానికి కారణమైన ఎన్‌డిఎ పక్షాల పాత్ర పరిమితంగానే కనిపిస్తోంది. విధానపరమైన నిర్ణయాలలో, పరిపాలనలో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలకు పెద్దగా భాగస్వామ్యం ఉన్నట్లుగా లేదు. సమిష్టి నిర్ణయాలు, ఆలోచనలు లేవు. గతంలో వాజ్‌పేయి హయాంలో తరచూ ప్రధాన అంశాలపై చర్చించేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఎన్‌డిఎ పక్షాలు కూడా ఇదేమిటని అడిగే ధైర్యం చేయడం లేదు. చంద్రబాబు లౌక్యంగా ఏపీకి, నితీశ్‌ కుమార్‌ బీహార్‌కు పరిమితం అయ్యారు. వారి రాష్ట్రాలకు నిధులు సమకూర్చుకోవడంలో ఉన్న ఆసక్తి, ప్రజల సంక్షేమంపై మాత్రం లేదు. వ్యవసాయ జాతీయ విధానం వంటి అంశాలను పట్టించుకోవడం లేదు.

విద్య, వైద్యం, మౌళిక వసతులు, రోడ్లు తదితర అంశాల పై జాతీయస్థాయిలో చర్చించి ప్రజలకు అనువైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు కేవలం డవ్మిూ పాత్ర పోషిస్తున్నాయి. విద్యారంగంలో మార్పులు రావాల్సి ఉంది. ఇప్పుడున్న విద్యావిధానం ఉద్యోగాలను, ఉపాధిని చూపడం లేదు. విదేశాలకు వెళ్లి చదువుకుందామనుకుంటే ఖరీదైనదిగా ఆమరింది. విద్యారంగ సంస్కరణలు రావాలి. విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి. పెరిగిన డాలర్‌ విలువ, రూపాయి పతనంతో విదేశీ మారకం కోసం విద్యార్థులు, టూరిస్టులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటున్న ప్రధాని మోడీ కనీసం ఆడపిల్లల చదువుల ఖర్చుల గురించి ఆలోచించడం లేదు.

దేశీయంగా, విదేశీయంగా కూడా చదువులు భారంగా మారాయి. విదేశాలకు వెళుతున్న ఆడపిల్లలకు కనీసం వడ్డీ మాఫీ పథకం వర్తింప చేయాలన్న డిమాండ్‌ పట్టించు కోవడం లేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వడ్డీలేని రుణాలను లేదా నామమాత్రం వడ్డీతో దేశీయంగా, విదేశాల్లో ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించేలా పథకాలు రూపొందాల్సి ఉంది. కార్పోరేట్‌ కంపెనీలకు వేలకోట్లు పందేరం చేస్తున్న ప్రభుత్వం విద్యారంగంలో మాత్రం వెసలుబాటు చూపడం లేదు. బ్యాంకులు కూడా రకరకాల కొర్రీల గ్యారెంటీతోనే వడ్డీ రుణాలు అందిస్తున్నాయి.

మరోవైపు భారత ఆర్థికవ్యవస్థ కుదేలు కావడంతో పాటు, ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు అందనంత ఎత్తున ఉన్నాయి. వైద్య సేవలు భరించలేనంత భారంగా పెరిగాయి. కార్పోరేట్‌ ఆస్పత్రుల దోపిడీతో సామాన్యులు అప్పుల పాలవుతున్నారు. మందుల ధరలు విపరీతంగా పెంచేస్తున్నా పట్టించుకోవడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు కూడా ఎప్పటికప్పుడు పెంచడంతో సామాన్యుల బతుకు భారంగా మారుతోంది. పన్నుల భారం మోయలేక ప్రజల నడ్డి విరుగుతున్నది. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థికరంగాన్ని నిలబెట్టేలా లేవు. ఎడాపెడా పన్నులు విధించడంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఊపిరాడని స్థితికి చేరింది.

ఇదంతా ఒక ఎత్తయితే విదేశీ డాలర్‌ మారకం తీరని భారంగా మారింది. ఉన్నత చదువులకు వెళ్లాల నుకునే వారికి డాలర్‌ మారకం 86 రూపాయలకు పైనే కావడంతో తట్టుకోలేక పోతున్నారు. ఫీజులను డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఫీజల భారం తడిసి మోపెడు అవుతోంది. డబ్బున్నవాళ్లే చదువుకునేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి వాళ్లు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విదేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితితులు కానరావడం లేదు.

ఇలాంటి సమస్యలను ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు చర్చించాలి. ఇక్కడ ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ పూర్తి చేసి, ఇతర డిగ్రీలతో విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి ప్రధానంగా రెండు సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకటి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బ్యాంకులు సజావుగా స్పందించడం లేదు. డబ్బున్న వారికి రుణాలు అందుతున్నాయి. కానీ పేదలు, మధ్య తరగతి వారికి రుణాలు ఇవ్వడం లేదు. రెండోది రుణం పొందినా.. దాని వడ్డీ రేటు అధికంగా ఉంటోంది. విదేశాలకు వెళ్లి, చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం సంపాదించి వచ్చే సరికి రుణభారం మోయలేనంతగా పెరుగుతోంది. దీంతో సంపాదన అంతా చదువుకోసం తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించడానికే సరిపోతుంది. దీనికి తోడు విదేశీయానం కూడా భారంగా మారింది. ఇంధన ధరల వల్ల విమానరంగం టిక్కెట్లను అమాంతంగా పెంచేసింది. దీంతో అమెరికా తదితర దేశాలకు వెళ్లాలనుకున్న వారికి టిక్కెట్లు భారంగా మారాయి.

విదేశీ విద్య కావచ్చు, దేశీయంగా చదువుకునే విద్య కావచ్చు..సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు స్వశక్తివిూద బతికేలా చేయాలి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రుణాలను ఉదరాంగా ఇచ్చేలా చూడాలి. అప్పుడే మన యువత తమకాళ్లవిూద తాము నిలబడగలుగుతారు. దేశీయంగా ఉన్నత చదువులు చదివే వారికి, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లేవారి కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంకులు నామమాత్రపు గ్యారెంటీతో, నామమాత్రపు వడ్డీతో రుణాలు ఇచ్చేలా విధానాలు సరళీకరించాలి. అందుకు కేద్రం వడ్డీ భరించే పథకాన్ని ప్రవేశ పెడితే మరీ మంచిది. ఇలాంటి సమస్యలపై చర్చించే ధైర్యం ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు చేయకపోవడం దారుణం.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News