Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

KUCHIPUDI|కూచిపూడి నాట్య ప్రతిభకు చిరునామా స్నిషిక వైట్ల

తొలి అరంగేట్రంతో కళా ప్రపంచంలో కొత్త వెలుగు

అడుగు డిజిటల్ మీడియా స్పెషల్ స్టోరీ

జనగామ, జనవరి 03 (అడుగు న్యూస్):
పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన ప్రముఖ గ్రామీణ వైద్యులు కీ. శే వైట్ల లక్ష్మీపతి మనుమరాలు స్నిషిక వైట్ల చిన్న వయసులోనే కూచిపూడి నాట్యంలో విశేష ప్రతిభను కనబరుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. 04-05-2013న జన్మించిన స్నిషిక ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు కళను సమన్వయం చేస్తూ 80%కు పైగా మార్కులు సాధించడం ఆమె ప్రత్యేకత. గత ఐదేళ్లుగా కూచిపూడి నాట్యాన్ని అభ్యసిస్తూ వస్తున్న స్నిషికకు సూర్యదేవర సింధూజ గురువుగా, అయ్యప్ప టెంపుల్ బాగ్ అంబర్‌పేట్‌లోని సింజిని ఆర్ట్స్ సంస్థలో శిక్షణ అందిస్తున్నారు. కఠినమైన సాధన, శాస్త్రీయ నృత్యంలోని భావప్రకటన, లయ, హావభావాలపై పట్టు ఆమెను ముందుకు నడిపిస్తోంది.

ఇప్పటి వరకు పుట్టపర్తి సత్యసాయి ట్రస్టు కేంద్రం, రవీంద్రభారతి, శివమ్ టెంపుల్–శివమ్ రోడ్, సత్యసాయి నిగమాగమం, శ్రీ సత్యసాయి విద్యా నిహార్ హై స్కూల్ (డీడీ కాలనీ) వంటి ప్రముఖ వేదికలపై మొత్తం ఐదు స్టేజ్ ప్రోగ్రామ్స్‌లో నాట్యం చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రత్యేకంగా పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కుర్వంత్ హాల్‌లో నాలుగు వేల మందికి పైగా ప్రేక్షకుల ముందే ప్రదర్శన ఇవ్వడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. 2025 సంవత్సరం ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి రోజున ఆమె తొలి అరంగేట్రం జరగడం కళా జీవితంలో మైలురాయిగా నిలిచింది.

స్నిషిక తల్లి తండ్రులు శ్రీనివాస్ వైట్ల, సౌజన్య వైట్లలు కుమార్తె ప్రతిభను ప్రోత్సహిస్తూ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. నానమ్మ రామలక్ష్మీ ఆమె కళా ప్రయాణానికి పూర్తి చేదోడు వాదోడుగా ఉంటూ… ఆశీర్వాదంగా నిలుస్తున్నారు. తమ్ముడు క్రితిన్ వైట్ల (3వ తరగతి) కూడా అక్కను ఆదర్శంగా తీసుకుంటూ కరాటే లో శిక్షణ తీసుకుంటూ… ముందుకు సాగుతున్నాడు. స్నిషిక భవిష్యత్ లక్ష్యం స్వంత డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించి శాస్త్రీయ నాట్యాన్ని మరింత విస్తరించడమే. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అంతర్జాతీయ స్థాయిలో కళాకారులు ఎదగగలరని ఆమె ప్రయాణం నిరూపిస్తోంది. సాధన, క్రమశిక్షణ, కుటుంబ మద్దతుతో పాటు గురువు మార్గదర్శకత్వం కలిసినప్పుడు చిన్న వయసులోనే పెద్ద విజయాలు సాధించవచ్చని స్నిషిక వైట్ల కథ చెబుతోంది.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News