జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా మంగళవారం బండ్లగూడ ఆర్టీవో కార్యాలయం, కిమ్స్ ఆసుపత్రి సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు, వాహనదారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన మందులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఎల్. కిష్టయ్య, ఎంవిఐలు పర్విందర్ రాజు, ప్రవీణ్ కుమార్, జి.రవీందర్, ఏవో హరి ప్రసాద్, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

